AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: కేంద్రం నిర్లక్ష్యం వల్లే.. దేశంలో కరోనాతో 40లక్షల మంది మరణించారు: రాహుల్ గాంధీ

Rahul Gandhi: కేంద్రం ప్రభుత్వం నిర్లక్ష్యం వలెనే దేశంలో కరోనా(Corona) తో 40లక్షల మంది మరణించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ గాంధీ తన ట్విట్టర్ (Twitter( వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు కరోనాతో..

Rahul Gandhi: కేంద్రం నిర్లక్ష్యం వల్లే.. దేశంలో కరోనాతో 40లక్షల మంది మరణించారు: రాహుల్ గాంధీ
Rahul Gandhi
Surya Kala
|

Updated on: Apr 17, 2022 | 4:55 PM

Share

Rahul Gandhi: కేంద్రం ప్రభుత్వం నిర్లక్ష్యం వలెనే దేశంలో కరోనా(Corona) తో 40లక్షల మంది మరణించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ గాంధీ తన ట్విట్టర్ (Twitter( వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారంగా ఒకొక్కరికి రూ. 4లక్షలను ఇవ్వమని మరోసారి రాహుల్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్లోబల్ కోవిడ్ మరణాల సంఖ్యను బహిరంగపరచడానికి WHO చేస్తున్న ప్రయత్నాలను భారతదేశం నిలిపివేస్తోందని న్యూయార్క్ టైమ్స్ నివేదిక..  స్క్రీన్‌షాట్‌ను రాహుల్ గాంధీ ట్విట్టర్‌ లో షేర్ చేశారు.  అంతేకాదు.. ప్రధాని మోడీ నిజాలు మాట్లాడరు, ఇతరులను మాట్లాడనివ్వరు. ఆక్సిజన్ కొరత వల్ల ఎవరూ చనిపోలేదని అబద్ధాలు చెబుతారు!” అంటూ రాహుల్ గాంధీ నివేదిక స్క్రీన్ షాట్ తో పాటు ట్విట్ చేశారు.

తాను గతంలో కూడా చెప్పానని.. కోవిడ్ సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం వలన ఐదు లక్షలు కాదు, 40 లక్షల మంది భారతీయులు మరణించారని ఈ సందర్భంగా మళ్ళీ గుర్తు చేసుకున్నారు. ” అని కాంగ్రెస్ మాజీ చీఫ్ అన్నారు. ప్రధాని మోడీ ఈ మరణాలకు భాద్యత వహించి కొవిడ్ బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.

అయితే దేశంలో COVID-19 మరణాలను అంచనా వేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఒకొక్క దేశానికి ఒకొక్క  పద్దతిని ఉపయోగిస్తోందనే ఆరోపణలు గతంలో కూడా వినిపించాయి. తాజాగా WHOని భారతదేశం శనివారం ప్రశ్నించింది. భౌగోళిక పరిమాణం, జనాభా ఉన్న ఇంత విస్తారమైన దేశానికి మరణ గణాంకాలను అంచనా వేయడానికి ఇటువంటి గణిత నమూనాలను ఉపయోగించడం సాధ్యం కాదని పేర్కొంది.

Also Read: Mango Special: పండ్లకు రారాజు.. మామిడి పండు.. దేశంలో ఏ రాష్ట్రంలో ఏయే రకాలు లభిస్తాయో తెలుసా..