Mango Special: పండ్లకు రారాజు.. మామిడి పండు.. దేశంలో ఏ రాష్ట్రంలో ఏయే రకాలు లభిస్తాయో తెలుసా..

Mango Special: వేసవి కాలం(Summer Season) వచ్చిందంటే చాలు.. అందరి చూపు మామిడి పండ్లవైపు.. పండ్లకు రారాజు.. మామిడి పండు.. భారతదేశపు జాతీయ ఫలం (National Fruit).  దేశంలో పండే మామిడి..

Mango Special: పండ్లకు రారాజు.. మామిడి పండు.. దేశంలో ఏ రాష్ట్రంలో ఏయే రకాలు లభిస్తాయో తెలుసా..
Mangoes Special
Follow us

|

Updated on: Apr 17, 2022 | 4:36 PM

Mango Special: వేసవి కాలం(Summer Season) వచ్చిందంటే చాలు.. అందరి చూపు మామిడి పండ్లవైపు.. పండ్లకు రారాజు.. మామిడి పండు.. భారతదేశపు జాతీయ ఫలం (National Fruit).  దేశంలో పండే మామిడి పండ్లకు ప్రపంచ దేశాల్లో ప్రత్యేక ఆదరణ ఉంది. బంగిన పల్లి, కలెక్టర్, అరటి మామిడి, సువర్ణ రేఖ, నీలాలు, చెరకురసం, చిన్న రసం, పెద్ద రసం ఇలా అనేక మామిడి రకాలున్నాయి. మనదేశంలో సుమారు ఈ మామిడికి 4 వేల చరిత్ర ఉంది. అంతేకాదు ప్రపంచంలోనే అత్యధికంగా 25 మిలియన్ టన్నుల మామిడిపండ్లు మన దేశంలో ఉత్పత్తి అవుతున్నాయి.

ఈ మామిడి కాయలు ఉన్నప్పుడు పప్పు వంటి కూరలతో పాటు… ఊరగాయలు కూడా పెడతారు. ఇక వేసవిలో దొరికే పండ్లతో మామిడి తాండ్ర వాటిని స్వీట్స్ ను కూడా తయారు చేశారు. మామిడి పండ్లతో షేక్స్ వంటి అనేక రకాల ఆహారపదార్ధాలను తయారు చేస్తారు.  అయితే ఈ మామిడి పచ్చిగా ఉన్నప్పుడు.. పుల్లగాను.. పండిన తర్వాత తియ్యగాను ఉంటుంది. అంతేకాదు.. మామిడి అనేక రకాల ప్రత్యేకలు కూడా ఉన్నాయి అవి ఏమిటో చూద్దాం..

పచ్చి మామిడికాయ పుల్లగా ఉండడానికి కారణం.. దీంతో ఎక్కువ ఆమ్లం, తక్కువ చక్కెర ఉంటుంది.  అదే మామిడికాయ పండిన తర్వాత అందులో యాసిడ్ తగ్గి.. సహజ చక్కెర పెరుగుతుంది. అందుకనే పండిన అనంతరం తియ్యగా మారతాయి.

బీహార్ వాసులకి కూడా మామిడి పండ్లు అంటే ఎంతో ప్రీతి. బాంబే గ్రీన్, చౌసా, దసేహరి, ఫాజిలి, గుల్బకాస్, కిసేన్ బోగ్, హిమ్ సాగర్, జర్దాలు, లంగ్రా వంటి పండ్ల రకాలు బీహార్ లో దొరుకుతాయ్.

ఆంధ్రప్రదేశ్: ఇక్కడ బంగినపల్లి, సువర్ణరేఖ, నీలం, కలెక్టర్, అరటి మామిడి వాటిని అనేక రకాల మామిడి పండ్లు లభిస్తాయి. కానీ ఆంధ్రుల అభిమాన ఫలం మాత్రం బంగినపల్లి. దీనికి తెలుగువారి మనసులో ప్రత్యేక స్థానం ఉంది.

కర్ణాటక:  కలెక్టర్ , బంగినపల్లి,  నీలం, ముల్ గోవా,అల్ఫోన్సో వంటి మామిడి పండ్లు రకాలు లభిస్తాయి. .

చౌసా, దసేహరి, లంగ్రా, అల్పోన్సో, కేసర్, పైరి వంటి రకాల మామిడి పండ్లు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో లభ్యమవుతాయి.

చౌసా మామిడికి ఈ పేరు రావడానికి ఒక కథ కూడా ఉంది.. 1539లో బీహార్‌లోని చౌసాలో జరిగిన యుద్ధంలో షేర్ షా సూరి హుమాయూన్‌ను ఓడించాడు. ఈ విజయం సాధించిన ఆనందంలో షేర్ షా తనకు ఇష్టమైన మామిడిపండుకు చౌసా అని పేరు పెట్టాడు. అప్పటి నుంచి ఈ పేరుతోనే పిలుస్తారు. ఈ మామిడి పుట్టిల్లు ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లా.

అయితే కాలంలో వస్తున్న మార్పుల్లో భాగంగా ఇప్పుడు మామిడి మార్కెట్‌లో ఆగస్టు నుంచే వస్తుంది.. కానీ సీజనల్ మామిడి పండ్లు మాత్రం మార్చి-ఏప్రిల్ నుండి మార్కెట్ లోకి వస్తాయి.

ఇక మామిడి సీజన్ ముగిసే సమయానికి కేరళ, కర్ణాటకలో లభించే నీలమణి… మహారాష్ట్ర నుంచి అల్ఫోన్సో మామిడి పండు మార్కెట్ లో సందడి చేస్తుంది. అయితే మహారాష్ట్రలోని  అల్ఫోన్సో మామిడికి స్పెషల్ ప్లేస్ ఉంది. తీపి, రుచి. వాసన పరంగా భిన్నంగా ఉంటుంది. అంతేకాదు.. పండినా సరే.. వారం రోజులు నిల్వ ఉంటుంది. అందుకనే ఈ పండ్లను ఎక్కువగా ఎగుమతి చేస్తారు. ధర కూడా అధికం.

Also Read: South Africa Floods: దక్షిణాఫ్రికాలో వరదల బీభత్సం.. 400 మంది మృతి.. 40 వేల మంది నిరాశ్రయులు!

Ayurveda Helath Tips: ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్న పురుషులకు దివ్య ఔషధం.. అరటిపండు నెయ్యి మిశ్రమం