AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raj Thackeray: ఉద్ధవ్ ప్రభుత్వానికి రాజ్ థాకరే అల్టిమేటం, మే 3లోగా మసీదులపై లౌడ్ స్పీకర్లు తొలగించాలని డిమాండ్

మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగిస్తామన్న ప్రకటనపై ఇటీవల వార్తల్లో నిలిచిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే మరోసారి దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Raj Thackeray: ఉద్ధవ్ ప్రభుత్వానికి రాజ్ థాకరే అల్టిమేటం, మే 3లోగా మసీదులపై లౌడ్ స్పీకర్లు తొలగించాలని డిమాండ్
Raj Thackeray
Balaraju Goud
|

Updated on: Apr 17, 2022 | 3:25 PM

Share

Raj Thackeray: మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగిస్తామన్న ప్రకటనపై ఇటీవల వార్తల్లో నిలిచిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే మరోసారి దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ సంసిద్ధంగా ఉండాలని కోరుతున్నాను అని రాజ్ థాకరే అన్నారు. మే 3లోగా మసీదులపై ఉన్న లౌడ్ స్పీకర్లను తొలగించకుంటే తగిన సమాధానం చెప్పాలన్నారు. మసీదుల్లో లౌడ్ స్పీకర్ల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పాటించాలని ఆయన డిమాండ్ చేశారు. మహారాష్ట్ర దినోత్సవం అంటే మే 1న నేను ఔరంగాబాద్‌లో పెద్ద ర్యాలీలో ప్రసంగిస్తానని ఆయన చెప్పారు. అలాగే, జూన్ 5న అయోధ్యను సందర్శించబోతున్నాను. శ్రీరాముని దర్శనం చేసుకుంటాను. ఆ తరువాత, ఈ విషయంలో మరింత దూకుడుగా వెళ్తానన్నారు.

ఇటీవల రాజ్ థాకరే మసీదుపై ఉన్న లౌడ్ స్పీకర్ తొలగించాలని అల్టిమేటం ఇచ్చారు.. గుడి పడ్వా సందర్భంగా ముంబైలోని శివాజీ పార్క్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మట్లాడుతూ మసీదులపై ఉన్న మైకులను తొలగించకపోతే మసీదుల ఎదుట హనుమాన్ చాలీసా ప్లే చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మసీదుల్లో లౌడ్ స్పీకర్లను ఎక్కువ శబ్దంతో ఎందుకు ప్లే చేస్తారు అని ఆయన ప్రశ్నించారు. తాను మతోన్మాదిని కానని.. భక్తుడను అని అన్నారు. నేను ఎవరి ప్రార్ధనలు వ్యతిరేకించను. మమల్ని ఇబ్బంది పెట్టకండి.. ఉదయం ఐదు గంటలనుంచి మైక్ లో పెద్ద శబ్దంతో ప్రార్ధనలు చేస్తారు. లౌడ్ స్పీకర్ వాడమని ఏ మతంలో వ్రాయబడింది అని ఆయన అడిగారు. విదేశాల్లో చూడండి ఎక్కడా లౌడ్ స్పీకర్ కనిపించదు. మీరు ప్రార్ధన చేసుకోవాలనుకుంటే ఇంట్లో చేసుకోవాలని రాజ్ థాకరే సూచించారు. ఇతర మతాలను నొప్పించేది ఏ మతమో.. మాకు అల్లర్లు వద్దు అని హోం శాఖకు చెప్పాలనుకుంటున్నామని, మే 3వ తేదీలోగా మసీదులో లౌడ్‌స్పీకర్‌లన్నీ తొలగించాలని, మా వైపు నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు.”

ఈ క్రమంలోనే ఆదివారం రాజ్ థాకరే మసీదుల్లో లౌడ్‌స్పీకర్‌ను మళ్లీ ప్రశ్నించగా, రాజకీయ ర్యాలీకి లౌడ్‌స్పీకర్ ఏర్పాటు చేయాలంటే, పోలీసుల అనుమతి తీసుకోవాలని, మసీదుల్లో రోజుకు 5 సార్లు లౌడ్‌స్పీకర్లలో ప్రార్థనలు చేస్తారని అన్నారు. ఇది కొన్ని నియమాలు మరియు నిబంధనలు. ఇది కాదా. ప్రతిరోజూ వారిని ఎవరు అనుమతిస్తారు? ఈ రోజు వరకు అందరూ ఈ విషయాలను సహించేవాళ్లు లేరు. ఇది మతపరమైన అంశం కాదని, సామాజిక సమస్య అని, దీనిపై ఇప్పుడే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ప్రజలు, ముఖ్యంగా ముస్లిం సమాజం అర్థం చేసుకోవాలన్నారు.

కాగా రాజ్ థాకరే వ్యాఖ్యలపై శివసేన నేతలు ఘాటుగానే స్పందించారు. ఇక్కడ అంతా చట్ట ప్రకారమే జరుగుతుందని.. హోం మంత్రి చట్ట ప్రకారం ప్రతిదీ చేస్తారని అన్నారు. మహారాష్ట్రలోని మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తీయమని డిమాండ్ చేసే ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్నిటిలో మసీదులో అజాన్ ను నిలిపివేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Read Also….  Kamareddy Suicide Case: తల్లీకొడుకుల ఆత్మాహుతి కేసు కీలక మలుపు.. మున్సిపల్‌ ఛైర్మన్‌, సీఐ సహా ఏడుగురిపై ఎఫ్ఐఆర్!