Cars Prices: ఆ కారణంగా భారీగా పెగనున్న కార్ల ధరలు.. ఆందోళనలో ఆటో సెక్టార్..

Ayyappa Mamidi

Ayyappa Mamidi |

Updated on: Apr 17, 2022 | 3:38 PM

Cars Prices: కరోనా తరువాత చాలా మంది తమ స్తోమతకు తగినట్లుగా కొత్తగా కార్లను కొనాలనుకుంటున్నారు. కానీ.. తాజాగా వచ్చిన నిబంధనల కారణంగా వారి రేట్లు భారీగా పెరగనున్నాయి. వీటిపై పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Cars Prices: ఆ కారణంగా భారీగా పెగనున్న కార్ల ధరలు.. ఆందోళనలో ఆటో సెక్టార్..
cars

Cars Prices: కార్లలో ఎయిర్‌బ్యాగ్‌ల(Air Bags) విషయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రభావం పరిశ్రమపై ప్రతికూలంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రయాణీకుల వాహనాల్లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేయాలనే నిర్ణయం వల్ల వాటి ధరలు పెరుగుతాయని మారుతీ సుజుకీ (MARUTI SUZUKI) ఛైర్మన్ ఆర్‌సి భార్గవ అన్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ఇది వాహన తయారీదారుల అమ్మకాలపై ప్రభావం చూపుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే పెరుగుతున్న ముడిసరుకు ధరల కారణంగా వాహనాల ధరలతో ఇబ్బందులు పడుతున్న కంపెనీలపై ఇది మరింత ఒత్తిడిని పెంచుతుందన్నారు. ఈ కారణంగా కొత్తగా వాహనాలు కొనాలనుకునే వారు దూరమవుతారని అన్నారు. అక్టోబర్ 1 నుంచి తయారయ్యే అన్ని ప్యాసింజర్ కార్లలో కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా దీనిని ప్రవేశ పెట్టినట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా చిన్న కార్ల అమ్మకాలు ఇప్పటికే భారీగా పడిపోయనట్లు మారుతీ సుజుకీ ఛైర్మన్ వెల్లడించారు.

పెద్ద కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్ నియమాలను అమలు చేయడం వల్ల వాటి ధర పెరుగుతుందన్నారు. దీని ప్రభావం చిన్న కార్ల మార్కెట్‌పై ఉంటుందని వెల్లడించారు. దీంతో వినియోగదారులు ఖరీదైన కార్లను కొనుగోలు చేయలేరన్నారు. దేశంలో తయారయ్యే అన్ని కార్లలో డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్లకు ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తున్నారు. రెండు ఎయిర్ బ్యాగ్ లకు అదనంగా  మరో నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లను ఏర్పాటు చేయడం వల్ల ధర రూ.17,600 పెరుగుతుందని ఆటో మార్కెట్ డేటా ప్రొవైడర్ జాటో డైనమిక్స్ వెల్లడించింది.

కేంద్రం తెచ్చిన కొత్త నిబంధనలకు అనుగుణంగా.. కంపెనీలు కారు డిజైన్‌ను మార్చుకోవాల్సిన అవసరం ఉన్నందున దానికి అనుగుణంగా చేసే మార్పుల వల్ల ఖర్చు మరింత ఎక్కువగా ఉండనుందని జాటో ఇండియా ప్రెసిడెంట్ రవి భాటియా అన్నారు. 2020లో భారతదేశంలో 3,55,000 రోడ్డు ప్రమాదాల్లో 1,33,000 మంది మరణించారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కార్లలో తగినన్ని ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటే ఈ మరణాల్లో 13 శాతం తగ్గించవచ్చు. దీంతో రవాణా మంత్రిత్వ శాఖ ఈ కొత్త ఎయిర్ బ్యాగ్స్ నిబంధన విషయంలో వెనక్కు తగ్గడం లేదు.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Forex Reserves: భారత్ వద్ద వేగంగా కరిగిపోతున్న ఫారెక్స్ నిల్వలు.. వరుసగా ఐదోవారంలోనూ ఎందుకంటే..

Anand Mahindra: టాటాలకు ఆనంద్ మహీంద్రా విజ్ఞప్తి.. అలా చేయాలంటూ ట్విట్టర్ వేదికగా వినతి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu