Economic crises: భారత్ చుట్టూ ముదురుతున్న సంక్షోభం.. ఇవి మన దేశంపై ప్రభావం చూపుతాయా..

Economic crises: భారత్ సరిహద్దులోని దేశాల్లో పరిస్థితులు ఆందోళన కరంగా మారాయి. పాకిస్తాన్(Pakistan) కు కొత్త ప్రధాని రావటం, శ్రీలంకను ఆర్థిక సంక్షోభం కుదిపేయటం, చైనా(China)లో కరోనా కేసులు కొత్తగా ఆందోళనను కలిగిస్తున్నాయి.

Economic crises: భారత్ చుట్టూ ముదురుతున్న సంక్షోభం.. ఇవి మన దేశంపై ప్రభావం చూపుతాయా..
Economic Crisis
Follow us

|

Updated on: Apr 17, 2022 | 4:16 PM

Economic crises: భారత్ సరిహద్దులోని దేశాల్లో పరిస్థితులు ఆందోళన కరంగా మారాయి. పాకిస్తాన్(Pakistan) కు కొత్త ప్రధాని రావటం, శ్రీలంకను ఆర్థిక సంక్షోభం కుదిపేయటం, చైనా(China)లో కరోనా కేసులు కొత్తగా ఆందోళనను కలిగించటం వంటి కారణాల వల్ల ఎకానమీలో పరిస్థితులు అస్థిరంగా మారాయి. పాకిస్తాన్ లో ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి తప్పుకోవాల్సి రావటం వల్ల రాజకీయ సంక్షోభం అక్కడ నడుస్తోంది. ఇదే సమయంలో పాకిస్తాన్ అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడటం వల్ల ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత అక్కడ అమాంతం పెరిగిపోయాయి. ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి తప్పుకోవలసి రావటం వల్ల మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబజ్ షరీఫ్ ఆర్థిక సంక్షోభాన్ని గాడిన పెడతానంటూ పదవిలోకి వచ్చారు. కానీ పరిస్థితులు అందుకు ఏ మాత్రం అనుకూలంగా లేవని నిపుణులు చెబుతున్నారు.

మరో సరిహద్దు దేశమైన శ్రీలంక పెరిగిన ఇంధన ధరలు, విదేశీ మారక నిల్వలు తరిగిపోవటం, అప్పుల భారం, ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. దీనివల్ల అక్కడి ప్రజలు గంటల కొద్దీ కరెంటు కోతలు, పాలు, బియ్యం, మందులు వంటి నిత్యావసరాల కొరతతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. భారత్ ఆపన్న హస్తం అందిస్తున్నా.. అవి పరిస్థితులను పూర్తిగా గాడిలో పెట్టడానికి సరిపోదని తెలుస్తోంది. వారాంతపు కర్ఫ్యూలు, మంత్రుల రాజీనామాల కారణంగా అక్కడ హింస చెలరేగుతోంది. ఇలాంటి కారణాల వల్ల అనేక మంది లంకీయులు తమిళనాడు తీరంలోని అనేక ప్రాంతాలకు వలస వస్తున్నారు.

మరో పక్క కరోనా కేసులు అమాంతం పెరగటం వల్ల చైనాలోనూ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. 2020లో ఊహాన్ నగరంలో చూసిన పరిస్థితులు మళ్లీ కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. దీనిని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించటం వల్ల నెలకు 46 బిలియన్ డాలర్ల వరకు నష్టం వాటిల్లుతోంది. తయారీ రంగం వల్ల జీడీపీలో 3.1 శాతం నష్టం వాటిల్లుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిణామాల కారణంగా ఆ ప్రభావం భారత్ పై కూడా పడే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. నేపాల్ లోని ఆర్థిక పరిస్థితులు సైతం ఆందోళన కరంగానే ఉన్నాయి. అక్కడి ప్రభుత్వం దిగుమతులపై ఇప్పటికే ఆంక్షలు విధించింది.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Cars Prices: ఆ కారణంగా భారీగా పెగనున్న కార్ల ధరలు.. ఆందోళనలో ఆటో సెక్టార్..

Anand Mahindra: టాటాలకు ఆనంద్ మహీంద్రా విజ్ఞప్తి.. అలా చేయాలంటూ ట్విట్టర్ వేదికగా వినతి..

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు