AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamareddy Suicide Case: తల్లీకొడుకుల ఆత్మాహుతి కేసు కీలక మలుపు.. మున్సిపల్‌ ఛైర్మన్‌, సీఐ సహా ఏడుగురిపై ఎఫ్ఐఆర్!

మెదక్‌ జిల్లా రామాయంపేటలో తల్లీకొడుకుల ఆత్మహత్య కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే మృతుడు సంతోష్‌ సూసైడ్‌ నోట్‌లో ఉన్న వారందరిపైన కేసు నమోదు చేశారు.

Kamareddy Suicide Case: తల్లీకొడుకుల ఆత్మాహుతి కేసు కీలక మలుపు.. మున్సిపల్‌ ఛైర్మన్‌, సీఐ సహా ఏడుగురిపై ఎఫ్ఐఆర్!
Kamareddy Suicide Case
Balaraju Goud
|

Updated on: Apr 17, 2022 | 3:06 PM

Share

Kamareddy Suicide Case: మెదక్‌ జిల్లా(Medak District) రామాయంపేట(Ramayampet)లో తల్లీకొడుకుల ఆత్మహత్య కేసు(Mother and Son Suicide Case)లో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే మృతుడు సంతోష్‌ సూసైడ్‌ నోట్‌లో ఉన్న వారందరిపైన కేసు నమోదు చేశారు. తల్లీ కొడుకులు గంగం పద్మ, సంతోష్‌ సూసైడ్‌ కేసులో సంతోష్‌ సోదరుడు శ్రీధర్‌ ఫిర్యాదుతో కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో బాధితులకు న్యాయం చేస్తామని ఇప్పటికే మెదక్‌ ఎస్పీ రోహిణి హామీఇచ్చారు. నిందితులపై 306 R/W సెక్షన్‌ కింద కేసునమోదు చేసిన పోలీసులు.. ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు.

ఈ కేసు విచారణలో ఎలాంటి ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు కామారెడ్డి సీఐ నరేశ్‌. ఇన్వెస్టిగేషన్‌ ముమ్మరం చేశామన్నారాయన. త్వరలోనే టెక్నికల్‌ ఎవిడెన్స్‌లు సేకరించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. సంతోష్‌ ఫోన్‌ డేటాను రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ కేసు విచారణకు ప్రత్యేక విచారణాధికారిగా బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. మృతుల సూసైడ్‌ నోట్‌, సెల్ఫీ వీడియో, ఆడియో ఆధారంగా ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించారనే అభియోగాలపై ఏ1గా పల్లె జితేందర్‌గౌడ్‌, ఏ2 సరాబ్‌ యాదగిరి, ఏ3 పృథ్వీగౌడ్‌ ఐరేని, ఏ4 తోట కిరణ్‌, ఏ5 కన్నాపురం కృష్ణా గౌడ్‌, ఏ6 సరాబ్‌ స్వరాజ్‌, ఏ7 సీఐ నాగార్జున గౌడ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

కేసుతో సంబంధం ఉన్న నిందితులను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మెదక్‌ జిల్లా పోలీసుల సమన్వయంతో కామారెడ్డి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ప్రధానంగా రామాయంపేట మున్సిపల్‌ ఛైర్మన్‌ జితేందర్‌గౌడ్‌, మార్కెట్‌ ఛైర్మన్‌ యాదగిరి, సీఐ నాగార్జున గౌడ్‌ పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జిలో శనివారం తెల్లవారుజామున మెదక్‌ జిల్లా రామాయంపేటకు చెందిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి గంగం సంతోష్‌(41), ఆయన తల్లి పద్మ(68) ఆత్మాహుతి చేసుకున్నారు. తమ చావుకు రామాయంపేట పట్టణానికి చెందిన మున్సిపల్ ఛైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్‌, ఐరేని పృథ్వీరాజ్‌ అలియాస్‌ బాలు, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ సరాబ్‌ యాదగిరి, తోట కిరణ్‌, కన్నాపురం కృష్ణాగౌడ్‌, సరాబ్‌ యాదగిరి కుమారుడు సరాబ్‌ స్వరాజ్‌, ప్రస్తుతం తుంగతుర్తి సీఐగా పనిచేస్తున్న తాండూరి నాగార్జునగౌడ్‌ కారణమంటూ ఫేస్‌బుక్‌లో వేర్వేరుగా సందేశాలు పెట్టి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ‘మా చావుకు కారణమైన వారిని అందరూ చూస్తుండగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి శిక్షించాలి’ అని వేడుకున్నారు. పోలీసు ఈ దిశగా కేసు దర్యాప్తు చేపట్టారు.

Read Also.. AP Weather Alert: ఏపీలో అకాల వర్షాలు.. అన్నదాతకు అలెర్ట్.. 3 రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు