AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: హైదరాబాద్‌లో కిడ్నాప్.. సిద్దిపేటలో మర్డర్.. భువనగిరిలో పరువు హత్య కలకలం..

Ex home guard murder: భువనగిరిలో అదృశ్యమైన మాజీ హోంగార్డ్‌ రామకృష్ణ కథ విషాదాంతమైంది. పరువు హత్య కమ్‌ సుపారీ మర్డర్‌గా తేల్చారు పోలీసులు. కొన్ని నెలల క్రితం భార్గవి అనే యువతిని రామకృష్ణ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

Telangana: హైదరాబాద్‌లో కిడ్నాప్.. సిద్దిపేటలో మర్డర్.. భువనగిరిలో పరువు హత్య కలకలం..
Wife Murder
Shaik Madar Saheb
|

Updated on: Apr 17, 2022 | 11:31 AM

Share

Ex home guard murder: భువనగిరిలో అదృశ్యమైన మాజీ హోంగార్డ్‌ రామకృష్ణ కథ విషాదాంతమైంది. పరువు హత్య కమ్‌ సుపారీ మర్డర్‌గా తేల్చారు పోలీసులు. కొన్ని నెలల క్రితం భార్గవి అనే యువతిని రామకృష్ణ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అది నచ్చని యువతి మేనమామ రౌడీషీటర్‌కి సుపారీ ఇచ్చి కిరాతకంగా చంపించాడని పోలీసులు వెల్లడించారు. భార్గవి-రామకృష్ణ ఇద్దరూ ప్రేమించుకున్నారు. 2020, ఆగస్టు 16న ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప. తుర్కపల్లిలో గుప్తనిధుల తవ్వకాల కేసులో హోంగార్డ్‌ రామకృష్ణ సస్పెండ్‌ అయ్యాడు. అప్పటినుంచి రియల్‌ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయిన రామకృష్ణ మళ్లి తిరిగి రాలేదు. కంగారుపడ్డ కుటుంబసభ్యులు పోలీసుల్ని ఆశ్రయించారు.

రామకృష్ణ కోసం పోలీసులు గాలిస్తుండగానే మెదక్‌ జిల్లా కుక్కునూర్‌పల్లి లగ్గారంలో శవమై కనిపించాడు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో ఆరా తీశారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఆసక్తికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. రామకృష్ణది పరువు హత్యగా తేల్చారు. భార్గవి ప్రేమ పెళ్లి చేసుకోవడం ఆమె మేనమామ వెంకటేష్‌కు నచ్చలేదు. వీఆర్వోగా పనిచేసే వెంకటేష్‌ రామకృష్ణను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. రౌడీషీటర్‌ లతీఫ్‌ను కాంటాక్ట్‌ అయ్యాడు. భారీ మొత్తాన్ని సుపారీ కింద ఇచ్చాడు. దీంతో ప్లాన్‌ ప్రకారం మాజీ హోంగార్డ్‌ రామకృష్ణను కిడ్నాప్‌ చేశాడు లతీఫ్‌. ఆ తర్వాత హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. రియల్ ఎస్టేట్ భూమి చూపించాలని లతీఫ్ రామకృష్ణను హైదరాబాద్ కు తీసుకెళ్లాడు. అనంతరం కిడ్నాప్ చేసి హత్యచేసినట్లు తెలిపారు.

Also Read:

Post Office: పోస్టాఫీసు ఖాతాదారులు అలర్ట్‌.. ఇంటర్‌నెట్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ని ఇలా యాక్టివేట్ చేసుకోండి..!

Viral Video: శునకములయందు ఈ శునకము వేరయా.. అరుదైన రికార్డు కైవసం