Kamareddy: కామారెడ్డి తల్లీకొడుకు ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం.. నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాల వేట

Kamareddy mother-son suicide case: కామారెడ్డి తల్లీకొడుకుల ఆత్మహత్య ఘటన రాష్ట్రంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు విచారణ వేగవంతం అయింది.

Kamareddy: కామారెడ్డి తల్లీకొడుకు ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం.. నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాల వేట
Kamareddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 17, 2022 | 11:52 AM

Kamareddy mother-son suicide case: కామారెడ్డి తల్లీకొడుకుల ఆత్మహత్య ఘటన రాష్ట్రంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు విచారణ వేగవంతం అయింది. సూసైడ్‌ నోట్‌ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ..పరారీలో ఉన్న పోలీసులు ఏడుగురి కోసం 3 ప్రత్యేక బృందాలతో వేట మొదలెట్టారు. విచారణ అధికారిగా బాన్సువాడ డిఎస్పీ జైపాల్ రెడ్డిని నియమించింది ప్రభుత్వం. సంఘటనా స్థలం నుంచి సంతోష్‌ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు .. దాని బ్యాకప్‌ తీసుకుంటే కీలక సమాచారం దొరికే అవకాశం ఉందని చెబుతున్నారు. సంతోష్ పర్సనల్ డేటా ట్రాన్సఫర్ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు. కాల్ డేటాను పరిశీలిస్తున్నారు.నెల రోజుల నుండి జితేందర్ గౌడ్ నంబర్ ,యాదగిరి నంబర్‌తో పాటు గుర్తు తెలియని నంబర్ల నుండి సంతోష్‌కు ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయి. దీంతో హోటల్ చెక్ ఇన్ అయిప్పటి నుంచి ఎప్పుడు ఫోన్ చేసిన సంతోష్ ఫోన్ స్విచ్ అప్ వచ్చేదని బంధువులు చెబుతున్నారు.

కాగా.. శనివారం తెల్లవారుజామున.. తల్లీ కొడుకులు గంగం సంతోష్, పద్మ  లాడ్జిలో నిప్పంటించుకొని ప్రాణాలు తీసుకున్నారు. తమపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నాడని.. ఏడాదిన్నరగా వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ సూసైడ్ నోట్ రాసి మరీ ప్రాణాలు తీసుకోవడం తీవ్ర కలకలం రేపింది.

ఏడుగురి వల్ల ఎన్నో ఆస్తులు కోల్పోయానని.. వ్యాపార వ్యవహారాల్లో అడ్డుపడుతున్నారని.. సంబంధం లేని కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ బాధితులు వీడియోలో పేర్కొన్నారు. బిజినెస్‌లో 50 శాతం వాటా ఇవ్వాలని ఒత్తిడి చేశారని.. రూ.25 లక్షలు ఇవ్వాలని బెదిరించారిని సంతోష్ పేర్కొన్నాడు.

ఈ మొత్తం ఘటనకు రామాయంపేట్ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పృథ్వీరాజ్, యాదగిరి, కిరణ్, కృష్ణా గౌడ్, స్వరాజ్, సీఐ నాగార్జున గౌడ్.. కారణమని సంతోష్, పద్మ ఆత్మహత్యకు మందు వీడియోలో పేర్కొన్నారు. దీంతోపాటు లేఖ సైతం రాసి ప్రాణాలు తీసుకున్నారు.

Also Read:

Telangana: హైదరాబాద్‌లో కిడ్నాప్.. సిద్దిపేటలో మర్డర్.. భువనగిరిలో పరువు హత్య కలకలం..

Hyderabad: చందానగర్‌లో విషాదం.. మహిళా న్యాయవాది ఆత్మహత్య.. భవనంపై నుంచి దూకి..