Jahangirpuri Violence: తుపాకులు, కత్తులతో ఊరేగుతుంటే ఏంచేస్తున్నారు.. ఢిల్లీ హింస కేసులో పోలీసులపై అక్బరుద్దీన్ ఫైర్!

ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఊరేగింపు సందర్భంగా హింసాత్మక ఘటనలు తీవ్రరూపం దాల్చాయి.

Jahangirpuri Violence: తుపాకులు, కత్తులతో ఊరేగుతుంటే ఏంచేస్తున్నారు.. ఢిల్లీ హింస కేసులో పోలీసులపై అక్బరుద్దీన్ ఫైర్!
Akbaruddin Owaisi
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 17, 2022 | 4:56 PM

Jahangirpuri Violence: ఢిల్లీ(Delhi)లోని జహంగీర్‌పురి ప్రాంతంలో హనుమాన్ జయంతి(Hunuman Jayanthi) సందర్భంగా ఊరేగింపు సందర్భంగా హింసాత్మక ఘటనలు తీవ్రరూపం దాల్చాయి . ఈ ఘటనపై ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఢిల్లీ పోలీసులను ప్రశ్నించారు. మసీదుపై కొందరు కాషాయ జెండాను పెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. దీనితో పాటు, ఢిల్లీ పోలీసుల చర్యను ప్రశ్నిస్తూ , మీరు ఇప్పటివరకు ఎంత మందిని అరెస్టు చేశారో చెప్పాలన్నారు. ఊరేగింపులో ఆయుధాలు ఊపుతూ భయాందోళనలకు గురి చేశారని ఒవైసీ ఆరోపించారు.

ఆదివారం ఒక వీడియోను పంచుకుంటూ, అక్బరుద్దీన్ ఒవైసీ తన ట్వీట్‌లో ఇలా వ్రాశారు, మత విద్వేషపూరిత ఉగ్రవాదులు బహిరంగంగా తుపాకులు, కత్తులతో ఊరేగింపులో పాల్గొన్నారు. ఢిల్లీ వీధుల్లో భీభత్సం సృష్టించారు. మసీదు ముందు ఆయుధాలతో నృత్యం చేసి, జై శ్రీరామ్ నినాదంతో మసీదు పైన కాషాయ జెండాను ఉంచేందుకు ప్రయత్నించారు. ఢిల్లీ పోలీసులు, మీరు ఇప్పటివరకు ఎంతమంది అల్లరిమూకలను అరెస్టు చేశారు?’ ఏ వ్యక్తులను అరెస్టు చేయాలనుకుంటున్నారో కూడా ఆయన ట్వీట్ చేయడం ద్వారా స్పష్టం చేశారు.

జహంగీర్‌పురి హింసాకాండ ఘటనపై రాజకీయ పార్టీలు తీవ్ర స్థాయి విరుచుకుపడుతున్నాయి. భారతదేశంలోని ప్రజలకు వారి మతం ప్రకారం ఆచరించే స్వేచ్ఛ ఉందని, మత వర్గాల మధ్య అసహనం లేదని మైనారిటీల మంత్రిత్వ శాఖలోని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ఒక వార్తాపత్రికతో ఆయన మాట్లాడుతూ సామాజిక వ్యతిరేకులు శాంతి, శ్రేయస్సును జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. భారతదేశం సమ్మిళిత సంస్కృతి, నిబద్ధతను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది సహించరానిదన్నారు.

మతపరమైన ఊరేగింపుల సందర్భంగా హింస ఇటీవలి వారాల్లో ఢిల్లీలోనే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాల్లో కూడా చోటు చేసుకున్నాయి. శ్రీరామనవమి పూజ సందర్భంగా మాంసాహారం అందించడంపై ఢిల్లీ యూనివర్సిటీలో రెండు గ్రూపుల విద్యార్థులు ఘర్షణకు దిగారు. దీని స్పందించిన కేంద్రమంత్రి నఖ్వీ.. ‘ప్రజలకు ఏమి తినాలో, ఏది తినకూడదో చెప్పడం ప్రభుత్వ పని కాదు. దేశంలోని ప్రతి పౌరుడికి తనకిష్టమైన ఆహారం తినే హక్కు ఉంది. మరోవైపు, జహంగీర్‌పురి హింస కేసు గురించి మాట్లాడుతూ.. పోలీసులు ఇప్పటివరకు 14 మంది అనుమానితులను అరెస్టు చేశారు. వీరిలో అన్సార్ అనే వ్యక్తి అల్లర్లకు సూత్రధారిగా అభివర్ణిస్తున్నారు. ఈ మేరకు పోలీసు వర్గాలు తెలిపాయని ఆయన వెల్లడించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎవరిని ఉపక్షించేదీ లేదని మంత్రి నఖ్వీ స్పష్టం చేశారు.

Read Also….  Karnataka: హుబ్లీలో వాట్సాప్ స్టేటస్‌పై చెలరేగిన హింస.. 40 మంది అరెస్ట్.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలుః సీఎం