AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moon Dust: ఆఫ్ట్రాల్ ధూళి.. ఏకంగా రూ.4 కోట్లకు అమ్ముడయ్యింది.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్!

న్యూయార్క్‌లో అంతరిక్ష చరిత్రకు సంబంధించిన వేలంలో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై మొదటి మెట్టుపైకి తెచ్చిన చంద్ర మట్టిలో కొంత భాగాన్ని బోన్‌హామ్స్ వేలంపాటదారులు విక్రయించారు.

Moon Dust: ఆఫ్ట్రాల్ ధూళి.. ఏకంగా రూ.4 కోట్లకు అమ్ముడయ్యింది.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్!
Mooon Dust
Balaraju Goud
|

Updated on: Apr 17, 2022 | 5:39 PM

Share

Moon Dust Action: 1969 అపోలో 11 మిషన్(Apollo 11 Mission) సమయంలో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్(Neil Armstrong) తనతో పాటు చంద్రునిపైకి తెచ్చిన మట్టిని వేలం వేయగా దాదాపు రూ. 3.84 కోట్ల (504,375 డాలర్లు). వాస్తవానికి, న్యూయార్క్‌లో అంతరిక్ష చరిత్రకు సంబంధించిన వేలంలో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై మొదటి మెట్టుపైకి తెచ్చిన చంద్ర మట్టిలో కొంత భాగాన్ని బోన్‌హామ్స్ వేలంపాటదారులు విక్రయించారు. ఆర్మ్‌స్ట్రాంగ్ 1969లో అపోలో 11 మిషన్‌లో చంద్రునిపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి. అప్పుడు అతను జ్ఞాపకార్థం తనతో పాటు తెచ్చుకున్నారు. ఫోర్బ్స్ ప్రకారం, వేలానికి ముందు బోన్‌హామ్స్ దాని ధరను సుమారు $8 నుండి 1.2 మిలియన్లుగా అంచనా వేసింది. కానీ దానికి చివరిగా పలికిన ధర 4 లక్షల డాలర్లు. ఇది ఇతర వస్తువులతో కలిపి $ 504,375కి చేరుకుంది.

కంటికి కనిపించే చంద్రుడు ఇప్పటికీ ఒక ఎనిగ్మానే. అక్కడ ఏముంటుందో తెలుసుకోవాలనే కుతూహలం మానవజాతికి అనాదిగా ఉంది. అందులో భాగంగా 1969 మే నెలలో అమెరికా అపోలో 11 పేరుతో ఒక మిషన్‌ను చంద్రుడిపై పంపించింది. చంద్రుడిపై తొలిసారి పాదం మోపిన మానవుడిగా ఖ్యాతి తెచ్చుకున్నారు అమెరికాకు చెందిన వ్యోమగామి నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌. ఆయన చంద్రుడిపై కాలు పెట్టిన 19 నిమిషాల తర్వాత ఆయన సహచరుడు బజ్‌ ఆల్డ్రిన్‌ కూడా అడుగుపెట్టారు. ఇద్దరు చంద్రుడిపై 21 గంటల 36 నిమిషాల పాటు గడిపారు. మిషన్‌లో భాగంగా 21.5 కేజీల చంద్రుడిపై ఉండే వివిధ పదార్ధాలు సేకరించారు. అందులో భాగంగా అక్కడి ధూళిని కూడా సేకరించారు. ఇప్పుడు ఆ ధూళిలోని కొంత భాగం వేలం వేశారు. ఒక బ్లూ కలర్‌ ప్లాస్టిక్‌ కంటెయినర్‌లో ఐదు చిన్న అల్యూమినియం డిస్క్‌పై అతికించిన కార్బన్‌ టేప్‌పై ఈ ధూళి అణువులు ఉన్నాయి. చంద్రుడి నుంచి తెచ్చిన ధూళిని ఈ కార్బన్‌ టేప్‌ ద్వారానే తీసారు. వేలం వేసిన ధూళికి కూడా ఖ్యాతే కాదు ఘనచరిత్ర కూడా ఉంది. వేలానికి రాకముందే ఈ ధూళి కోసం న్యాయపోరాటాలు కూడా జరిగాయి.

నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రుడి నుంచి తెచ్చిన శాంపిల్స్‌కు మరింత పరిశోధన, అధ్యయనం కోసం నాసా తీసుకుంది. వాటిని పదిలపరిచేందుకు కాస్మోస్పియర్‌ స్పేస్‌ మ్యూజియంకు పంపించింది. అప్పట్లో ఆ మ్యూజియం డైరెక్టర్‌గా పనిచేసిన వ్యక్తి వాటిని ఆన్‌లైన్‌లో వేలం వేశారని తర్వాత తెలిసింది. అప్పట్లో నాన్సీ లీ కాల్‌సన్‌ అనే ఔత్సాహిక జియాలజిస్ట్‌ వాటిని 995 డాలర్లకు కొనుగోలు చేశారు. వీటిపై అనుమానం రావడంతో ఆమె వాటి స్వచ్ఛతను తెలుసుకునేందుకు నాసాకు పంపారు. ఆ తర్వాత ఆ వస్తువులు ప్రభుత్వ ఆస్తి అని పేర్కొంటూ నాసా తిరిగి ఇచ్చేందుకు నిరాకరించింది.

దానిని ధృవీకరణ కోసం NASAకి పంపినప్పుడు, అది అపోలో 11కి సంబంధించినది కనుక దానిని తిరిగి ఇవ్వడానికి NASA నిరాకరించింది. దీని కారణంగా US అటార్నీ 2016లో ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకున్నందుకు NASAపై దావా వేసి విజయం సాధించారు. నాసా ఈ మట్టిని తన ఆధీనం నుండి ఎలా బయటకు తీయడానికి అనుమతించిందనేది ఇప్పటి వరకు స్పష్టంగా తెలియనప్పటికీ. 2002లో ఇది కాన్సాస్‌లోని స్పేస్ మ్యూజియం సహ వ్యవస్థాపకుడు మాక్స్ ఆరే యాజమాన్యంలో ఉన్నట్లు నివేదించింది. మాక్స్ కళాఖండాలను దొంగిలించాడని కూడా ఆరోపించారు.

దీంతో కాల్‌సన్‌ నాసాపై దావా వేశారు. సుదీర్ఘ న్యాయపోరాటం చేసినా నాసా ఆ కేసు ఓడిపోయింది. వాస్తవానికి ఆ బ్యాగును వేలం వేయకూడదని అంటూనే కాల్‌సన్‌ దాన్ని చట్టబద్ధంగానే కొనుగోలు చేశారని అమెరికా ఫెడరల్‌ డిస్ట్రిక్ట్ జడ్జి తీర్పు ఇచ్చారు. ఆ బ్యాగును కాల్‌సన్‌ 2017లో న్యూయార్క్‌లో సోత్‌బీలో వేలం వేశారు. అప్పట్లో అది 1.8 మిలియన్లకు అమ్ముడుపోయింది. ఇప్పుడు ఆ బ్యాగు నుంచి సేకరించిన ధూళి అణువులను కాల్‌సన్‌ అమ్మకానికి పెట్టారు. దాదాపు 12 మిలియన్ డాలర్లకు ఇది అమ్ముడుపోతుందని ఆశించినా అంత ధర పలకలేదు. 220 వేల డాలర్లకు మొదలైన వేలంలో ఏడుగురు పోటీపడ్డారు. చివరకు 400 వేల డాలర్లకు అమ్ముడు పోయింది.

Read Also…  Jahangirpuri Violence: తుపాకులు, కత్తులతో ఊరేగుతుంటే ఏంచేస్తున్నారు.. ఢిల్లీ హింస కేసులో పోలీసులపై అక్బరుద్దీన్ ఫైర్!