- Telugu News Photo Gallery Best tourist places: Travel ideas take a look on these five best tourist places of India
Travel: వేసవిలో జంటగా టూర్‌కి వెళ్లాలనుకుంటున్నారా..? అద్భుతమైన నైట్ స్పాట్స్ ఇవే..
Best tourist places: భారతదేశంలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలున్నాయి. మన సంస్కృతి ఉట్టిపడేలా నిర్మించిన చారిత్రక కట్టడాలు, అందమైన భవనాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అయితే.. రాత్రిపూట మరింత అందంగా కనిపించే కొన్ని ప్రదేశాలు పర్యాటకులతో ఎప్పుడూ కూడా కళకళలాడుతుంటాయి.. ఒకవేళ మీరు టూర్‌కు వెళ్లాలనుకుంటే.. ఈ ప్రదేశాలకు వెళితే మరింత అనుభూతిని పొందవచ్చు..
Updated on: Apr 17, 2022 | 12:26 PM

అమృత్‌సర్: పంజాబ్‌లోని అమృత్‌సర్ మహా నగరంలో ఉన్న గోల్డెన్ టెంపుల్ మతపరంగానూ.. పర్యాటక ప్రాంతంగానూ విరాజిల్లుతోంది. గోల్డెన్ టెంపుల్ సాయంత్రం వేళ రకరకాల విద్యుత్ కాంతులతో విరజిమ్ముతుంది. ఈ దృశ్యం మనసును హత్తుకుంటుంది.

హర్ కి పౌరి, హరిద్వార్: ఉత్తరాఖండ్‌లో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఈ రాష్ట్రానికి ఏడాది పొడవునా పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇక్కడి ఆధ్యాత్మిక ప్రాంతమైన హరిద్వార్‌కు వేలాది మంది భక్తులు వచ్చి దర్శనాలు చేసుకుంటారు. కాగా.. హరిద్వార్‌లోని హర్ కీ పౌరిలో సాయంత్రం వేళల్లో అద్భుతమైన రమణీయ దృశ్యాలు అందర్ని ఆకట్టుకుంటాయి.

మెరైన్ డ్రైవ్, ముంబై: ముంబైలోని మెరైన్ డ్రైవ్ రాత్రిపూట సందర్శనకు చాలా ప్రసిద్ధి. ఇక్కడ సాయంత్రం వేళల్లో భాగస్వామితో కలిసి ఐస్ క్రీం తింటూ ఆనందించవచ్చు. రాత్రిపూట ఈ ప్రదేశం అందం మరింత రెట్టింపు అవుతుంది.

రాజ్‌పథ్: టూరిజం పరంగా అత్యుత్తమ గమ్యస్థానంగా పరిగణించే దేశ రాజధాని ఢిల్లీలో అనేక ప్రదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు రాత్రిపూట ఎక్కువగా తిరగడానికి ఇష్టపడతారు. ఇలాంటిదే రాజ్‌పథ్ కూడా ఒకటి.. రాజ్‌పథ్ రాత్రిపూట రంగురంగుల లైట్లతో ప్రకాశిస్తుంటుంది. ఈ దృశ్యం చాలా అద్భుతంగా కనిపిస్తుంది.

విక్టోరియా మెమోరియల్: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో విక్టోరియా మెమోరియల్ పర్యాటక ప్రదేశంగా ఉంది. పచ్చదనం మధ్య ఉన్న ఈ చారిత్రక స్మారకం రాత్రిపూట మరింత అందంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ దీనిని వీక్షించేందుకు చాలా ఇష్టపడతారు.

రాత్రి వేళల్లో ఈ ప్రదేశాలు అద్భుతంగా కనిపిస్తాయి. ఒకవేళ మీరు టూర్ కి వెళ్లానుకుంటే.. ఈ ప్రదేశాలపై ఓ లుక్కేయండి..




