AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Longest living animal: భూమిపై ఎప్పటికీ చావేలేని ప్రాణి ఇది.. దీని అసలు సీక్రెట్‌ ఇదే!

భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరూ, ప్రతీ ప్రాణి ఏదో ఒక సమయంలో, ఎప్పుడో ఒకప్పుడు చనిపోతారు. ప్రాణులన్నింటికీ మరణం అనివార్యం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ తాజాగా ఓ వింత విషయం వెలుగులోకి వచ్చింది. భూమిపై ఎప్పుడూ చనిపోని జీవి ఒకటి ఉందట..

Srilakshmi C
|

Updated on: Nov 23, 2025 | 8:21 PM

Share
భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరూ, ప్రతీ ప్రాణి ఏదో ఒక సమయంలో, ఎప్పుడో ఒకప్పుడు చనిపోతారు. ప్రాణులన్నింటికీ మరణం అనివార్యం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ తాజాగా ఓ వింత విషయం వెలుగులోకి వచ్చింది. భూమిపై ఎప్పుడూ చనిపోని జీవి ఒకటి ఉందట.

1 / 5
మనిషి తన మేథస్సుతో ఎంతో గొప్ప పురోగతి సాధించాడు. కానీ తన మరణాన్నికొన్ని సెకన్ల పాటైనా వాయిదా వేసుకునే మంత్రాన్ని మాత్రం మనిషి కనుక్కోలేకపోతున్నాడు. దీంతో ఎంత గొప్ప మేధావి అయినా ఆయుష్షు తీరిన తర్వాత తప్పక మరణించవల్సి వస్తుంది. కానీ ఈ భూమిపై ఒక జీవి ఉంది. అది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

2 / 5
ఈ జీవి ఎప్పటికీ చనిపోదని సైంటిస్టులు అంటున్నారు. దీని పేరు జెల్లీ ఫిష్. దీనిని శాస్త్రీయంగా టర్రిటోప్సిస్ డోహ్రిని అంటారు. ఈ జీవి చనిపోబోతున్నప్పుడల్లా అది మళ్ళీ యవ్వనంగా మారుతుందట.

3 / 5
ఏదైనా జెల్లీ ఫిష్ పై దాడి చేస్తే, ఆ దాడిలో ఆ జీవి తీవ్రంగా గాయపడితే లేదా సరైన ఆహారం తీసుకోకపోతే చనిపోతుందని అందరూ భావిస్తారు. కానీ గాయం అయిన ప్రతీసారి ఆ జీవి వెంటనే తన యవ్వనాన్ని తిరిగి పొందుతుంది. అందుకే అది సహజంగా చనిపోదని చెబుతున్నారు.

4 / 5
ఒక జెల్లీ ఫిష్ వృద్ధాప్యానికి చేరుకున్నప్పుడు దానిని మెడుసా అంటారు. అటువంటి స్థితిలో జెల్లీ ఫిష్ దాని టెంటకిల్స్‌ను వదులుతుంది. ఆ తరువాత దాని పునర్జన్మ ప్రయాణం మళ్లీ ప్రారంభమవుతుంది. ఈ విధంగా జెల్లీ ఫిష్ ఎప్పుడూ చనిపోదని సైంటిస్టులు చెబుతున్నారు.

5 / 5