Wonderful Music: క్యూట్.. క్యూట్‌గా.. పియానో ట్యూన్ ఆస్వాదిస్తున్న ఇంటి అతిథులు! స్వర్గం ఇలానే ఉంటుందా..
మధురగానాలను మనుషులేకాదండోయ్ ఈ మధ్య పిల్లులు కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నాయి. నమ్మబుద్ధి కావట్లేదా.. ఐఏ ఈ వండర్ ఫుల్ వీడియో మీరు చూడాల్సిందే..
Where words Fail, Music Speaks..అంటే మాటలు విఫలమైన చోట సంగీతం మాట్లాడుందని అర్ధం. పాషాణ హృదయాలను కూడా ద్రవింపజేసి, మంత్రముగ్ధులను చేసి తన గుప్పిట్లో ఉంచుకునే శక్తి ఈ ప్రపంచంలో సంగీతానికి మాత్రమే ఉంది. మనసుతో వింటే వీచేగాలి, పారే జలపాతం కూడా లయబద్ధంగా వినిపిస్తుంది. ఐతే దాన్ని ఆశ్వాదించే మనసులే వేర్వేరుగా ఉంటాయి. సంగీతాస్వాదన అందరికీ అట్టే అబ్బదు.. వాస్తవమే కదా! మధురగానాలను మనుషులేకాదండోయ్ ఈ మధ్య పిల్లులు కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నాయి. నమ్మబుద్ధి కావట్లేదా.. ఐతే ఈ వండర్ ఫుల్ వీడియో మీరు చూడాల్సిందే..
ఈ వీడియోలో ఓ ప్రొఫెషనల్ పియానిస్ట్.. అద్భుతంగా పియానో (Piano) వాయిస్తూ ఉంటాడు. అతని చుట్టూ కొన్ని పిల్లులు (Cats) పియానో ట్యూన్‌ను రిలాక్స్‌గా వింటూ.. ఆస్వాదించడం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను సర్పర్ డుమాన్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతోపాటు, యూట్యూబ్‌లో కూడా పోస్ట్ చేశాడు. Sarper Duman ఇన్‌స్టా ఖాతాలో ఇలాంటివే చాలా వీడియోలు కనిపిస్తాయి. ‘జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి రెండు రకాలుగా సేద తీరొచ్చు. ఒకటి మ్యూజిక్, రెండు పిల్లులు..ఆల్బర్ట్ ష్వీట్జర్’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే లక్షల్లో వీక్షణలు, వేలల్లో లైకులతో ఈ వీడియో నెట్టింట వైరలయ్యింది.
‘మీ మ్యూజిక్ అద్భుతం. చాలా ప్రశాంతంగా, ఓదార్పునిచ్చేలా ఉందని’ ఒకరు, ‘పిల్లులకు మీరు అమర్చిన త్రీ టైర్ బెడ్ అమరిక అద్భుతంగా ఉందని’ మరొకరు, ‘అచ్చం చూడటానికి స్వర్గంలా కనిపిస్తోంద’ని ఇంకొకరు ఇలా భిన్న కామెంట్లతో.. హార్ట్ ఎమోజీలతో.. అతన్ని ప్రశంశల్లో ముంచెత్తుతున్నారు. బ్యూటిఫుల్ మ్యూజిక్, ఆ మ్యూజిక్‌ని ఆరాధించే పిల్లులు.. అద్భుతం! అని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.. మీరేమంటారు!
View this post on Instagram
Also Read: