TS High Court Recruitment 2022: రూ.63 వేల జీతంతో.. తెలంగాణలో జిల్లా జడ్జి పోస్టులకు నోటిఫికేషన్‌..పూర్తి వివరాలు..

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ జ్యూడిషియన్‌ సర్వీసెస్‌ (Telangana Judicial Services)లో.. జిల్లా జడ్జి (District Judge Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

TS High Court Recruitment 2022: రూ.63 వేల జీతంతో.. తెలంగాణలో జిల్లా జడ్జి పోస్టులకు నోటిఫికేషన్‌..పూర్తి వివరాలు..
Ts High Court
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 17, 2022 | 8:18 PM

Telangana District Judge Recruitment 2022: తెలంగాణ ప్రభుత్వానికి చెందిన జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ జ్యూడిషియన్‌ సర్వీసెస్‌ (Telangana Judicial Services)లో.. జిల్లా జడ్జి (District Judge Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 13

ఖాళీల వివరాలు: జిల్లా జడ్జి (ఎంట్రి లెవల్‌) పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.51550ల నుంచి రూ.63,070ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఈ నోటిఫికేషన్‌ విడుదలైన నాటికి 7 ఏళ్లకు తగ్గకుండా అడ్వకేట్‌గా ప్రాక్టీస్‌ చేస్తూ ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, వైవా వాయిస్‌ (ఇంటర్వ్యూ) ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష విధానం: సివిల్‌ లా, క్రిమినల్‌ లా, ఇంగ్లిష్‌ అనే మూడు పేపర్లకు రాత పరీక్ష ఉంటుంది. ప్రతి పేపర్‌ 100 మార్కులకు ఉంటుంది. 3 గంటల పాటు పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు వైవా నిర్వహిస్తారు. ఇది 50 మార్కులకు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌ అభ్యర్ధులకు: రూ. 1000
  • ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు: రూ. 500

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: The Chief Secretary, Government of Telangana, General Administration, Burugula Rama Krishna Rao Bhavan, 9th floor, Adarsh Nagar, Hyderabad-500053,

దరఖాస్తులకు చివరి తేదీ: మే 2, 2022 (సాయంత్రం 5 గంటలలోపు).

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

IGNOU January 2022: ఇగ్నో 2022 జనవరి సెషన్‌ బీఈడీ, బీఎస్సీ నర్సింగ్ దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే..