IGNOU January 2022: ఇగ్నో 2022 జనవరి సెషన్ బీఈడీ, బీఎస్సీ నర్సింగ్ దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే..
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) జనవరి 2022 సెషన్‌కు నిర్వహించనున్న బీఈడీ, బీఎస్సీ నర్సింగ్ (పోస్ట్ బేసిక్) ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ శనివారం (ఏప్రిల్ 16) ప్రకటన విడుదల చేసింది..
IGNOU B.Ed and B.Sc Nursing 2022 application last date: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) జనవరి 2022 సెషన్‌కు నిర్వహించనున్న బీఈడీ, బీఎస్సీ నర్సింగ్ (పోస్ట్ బేసిక్) ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ శనివారం (ఏప్రిల్ 16) ప్రకటన విడుదల చేసింది. తాజా ప్రకటన ప్రకారం ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులెవరైనా ఉంటే అధికారిక వెబ్‌సైట్ ignou.ac.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఇక ఈ రెండు కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్ష మే 8(ఆదివారం)న దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది.
బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు RNRMలో రిజిస్ట్రేషన్ తర్వాత కనీసం రెండేళ్ల అనుభవంతో జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫ్ (GNM)లో డిప్లొమా ఉండాలి. లేదా వారు ఆర్‌ఎన్‌ఆర్‌ఎం రిజిస్ట్రేషన్ తర్వాత కనీసం ఐదేళ్ల అనుభవంతో జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం)లో డిప్లొమా ఉండాలి.
బీఎడ్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా సైన్సెస్/సోషల్ సైన్సెస్/కామర్స్/హ్యుమానిటీస్‌లో మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 55 శాతం మార్కులతో సైన్స్, మ్యాథమెటిక్స్ స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా తత్సమాన అర్హతలుండాలి.
Extension of last date for submission of form for B.Ed./ BSC Nursing Entrance Exams pic.twitter.com/bHnlXa35yv
— IGNOU (@OfficialIGNOU) April 16, 2022
Also Read: