AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో.. భయంకరమైన కోబ్రాకే ముద్దు పెట్టాడు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్..

King Cobra Shocking Video: సాధారణంగా పాములను చూస్తేనే గజగజ వణికిపోతుంటాం.. అలాంటి పాముకు ఓ వ్యక్తి ముద్దు పెట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అయితే.. సోషల్ మీడియాలో నిత్యం పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి.

Viral Video: వామ్మో.. భయంకరమైన కోబ్రాకే ముద్దు పెట్టాడు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్..
Cobra Viral Video
Shaik Madar Saheb
|

Updated on: Apr 17, 2022 | 2:04 PM

Share

King Cobra Shocking Video: సాధారణంగా పాములను చూస్తేనే గజగజ వణికిపోతుంటాం.. అలాంటి పాముకు ఓ వ్యక్తి ముద్దు పెట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అయితే.. సోషల్ మీడియాలో నిత్యం పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యంగా.. మరికొన్ని ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. అయితే.. తాజాగా ఇండోనేషియాకు చెందిన ఒక (Social Media) వీడియో వైరల్ అవుతోంది. జనసమూహంలో ఒక వ్యక్తి కింగ్ కోబ్రాను తలపై ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. మొదట్లో పాము బుసలు కొడుతూ భయంకరంగా కనిపిస్తుంది. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు అక్కడ కనిపిస్తారు. ఓ వ్యక్తి దానికి ముద్దు పెట్టుకుంటాడు. ఈ క్రమంలో అది ప్రశాంతంగా కనిపించడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

పాము తలపై ముద్దు పెట్టిన వ్యక్తి మిచిగాన్ కు చెందిన బ్రియాన్ బార్జిక్.. వన్యప్రాణుల నిపుణుడు. ఇతను Instagram హ్యాండిల్ “snakebytestv” అనే ఖాతను నడుపుతున్నాడు. బ్రియాన్ పాముల ప్రపంచం గురించి అన్ని రకాల జంతు ఔత్సాహికులకు అవగాహన కల్పిస్తుంటాడు. మిస్టర్ బార్జిక్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియోను షేర్ చేసాడు. తాను ఇలా చేయమని ఎవరినీ కోరను.. కానీ నేను మాత్రం ఖచ్చితంగా చేస్తానంటూ రాశాడు.

వైరల్ వీడియో..

అత్యంత విషపూరితమైన పాములలో ఒకటి కింగ్ కోబ్రా. కోబ్రా పాము గరిష్ట పొడవు 5.85 మీటర్ల వరకు ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. కింగ్ కోబ్రా కాటు వేసిన 15 నిమిషాల్లోనే మనుషులు చనిపోయే అవకాశముంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాది మంది వీక్షించి పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. దీంతోపాటు బార్జిక్ చేసిన ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు.

Also Read:

Viral Video; ఈ గుర్రానికి ఎలుక దొరికిందంటే అంతే..? వీడియో చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే..!

Viral Photo: ఇతను కళ్లతో మాయ చేస్తాడు.. మాటలతో బూరెలు వండేస్తాడు… ఎవరో గుర్తించారా..?