Dengue Fever: ప్రారంభంకానున్న వర్షాకాలం.. పొంచివున్న డెంగ్యూ ఫీవర్ ముప్పు.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
Dengue Fever: ప్రతి సంవత్సరం వర్షాకాలం నుండి అక్టోబర్ వరకు డెంగ్యూ-మలేరియా వ్యాధుల బారిన అధిక మంది పడుతున్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. MCD డెంగ్యూ కేసులపై ఒక నివేదికను విడుదల చేసింది.
Dengue Fever: దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి. తొలకరి జల్లులు పలకరిస్తున్నాయి. దీంతో వేడి నుంచి కొంత ఉపశమనం లభించింది. అయితే వేసవి నుంచి ఉపశమనంతో పాటు సీజనల్ వ్యాధులు విజృంభించే ప్రమాద ఘంటికలు కూడా మోగుతున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా వచ్చే ప్రమాదం ఉంది. ప్రతి సంవత్సరం వర్షాకాలం నుండి అక్టోబర్ వరకు డెంగ్యూ-మలేరియా వ్యాధుల బారిన అధిక మంది పడుతున్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. MCD డెంగ్యూ కేసులపై ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం, జనవరి 1, 2022 నుండి మే 28, 2022 వరకు, 111 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో, ఈ కాలంలో 18 మలేరియా కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో డెంగ్యూ-మలేరియా కేసులు కూడా నమోదుతున్నాయి. ఈ వ్యాధుల వలన చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. కనుక ఈ వ్యాధులను తేలికగా తీసుకోకూడదని వైద్య సిబ్బంది హెచ్చరిస్తున్నారు.
డెంగ్యూ అంటే ఏమిటి..?
ఆడ ఏడిస్ దోమ కుట్టడం వల్ల డెంగ్యూ వస్తుంది. ఈ దోమలు మురికిలో కాకుండా పరిశుభ్రమైన ప్రదేశాల్లో వృద్ధి చెందుతాయి. నగరాల్లో పరిశుభ్రమైన ప్రదేశాల్లో నివసించే వారు డెంగ్యూ బారిన పడుతున్నారు. ఇది టైప్-1, టైప్-2, టైప్-3 , టైప్-4 అని నాలుగు రకాలు. దీనిని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటారు.
డెంగ్యూ లక్షణాలు:
డెంగ్యూ జ్వరం రకాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి. చలి జ్వరం, ముక్కు నుంచి లేదా చిగుళ్ళు నుంచి రక్తం వస్తుంది. కొన్ని సార్లు బాధితుడు స్పృహ కోల్పోతాడు. రక్తపోటును కూడా తగ్గిస్తుంది. తలనొప్పి, కండరాల, ఎముక నొప్పి, ముసిముసి నవ్వులు, కళ్ళు నొప్పి, చర్మం పై దద్దుర్లు, నోరు రుచిని కోల్పోవడం వంటివి సాధారణ లక్షణాలు
డెంగ్యూ దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ఇంటి లోపల, వెలుపల నీరు నిలిచిపోకుండా ఏర్పాటు చేసుకోండి. నీరు నిల్వ ఉందని విధంగా ప్రదేశాలను శుభ్రంగా ఉంచండి.. వాటర్ ట్యాంక్‌ను మూతపెట్టి ఉంచండి. వారానికి ఒకసారి గది కూలర్ , వాటర్ ట్యాంక్‌లో పెట్రోల్ లేదా కిరోసిన్ చల్లండి ఫ్రిజ్ దిగువన ఉన్న వాటర్ ట్రేని రోజూ శుభ్రం చేసుకోండి.
డెంగ్యూ ఫీవర్ ప్లేట్‌లెట్ కౌంట్:
డెంగ్యూ జ్వరం వచ్చిన వ్యక్తి రక్తంలో ప్లేట్‌లెట్ కౌంట్ గణనీయంగా తగ్గడం ప్రారంభించినప్పుడు డెంగ్యూ మరింత తీవ్రమవుతుంది. ప్లేట్‌లెట్స్‌ని క్లాటింగ్ సెల్స్ అంటారు. కనుక ఎవరికైనా ప్లేట్‌లెట్ కౌంట్ స్థాయి ఇప్పటికే తక్కువగా ఉంటే.. వీరు ఇతరులకన్నా త్వరగా డెంగ్యూ బారిన పడవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..