- Telugu News Photo Gallery Diet Tips for Groom Every groom should follow or try these pre wedding diet secrets in Telugu
Diet Tips for Groom: పెళ్లికి ముందే ఆహారంలో ఈ మార్పులు చేసుకోండి.. ఈజీగా ఫిట్‌నెస్ సాధిస్తారు..!
Diet Tips for Groom: పెళ్లిలో అందంగా కనిపించేందుకు వధువు, వరులు ఇద్దరూ పెళ్లికి ముందు బ్యూటీ పార్లర్‌కు వెళ్లడం, స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండేందుకు కొన్ని నెలల ముందు నుంచే డైట్ మెయింటేన్ చేయడం చేస్తుంటారు. పెళ్లికి ముందు ఫిట్‌గా ఉండాలంటే ఆహారం విషయంలో శ్రద్ధ వహించడం తప్పనిసరి. మరి వివాహానికి ముందు ఎలాంటి డైట్ చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Jun 10, 2022 | 6:15 PM

Diet Tips for Groom: పెళ్లిలో అందంగా కనిపించేందుకు వధువు, వరులు ఇద్దరూ పెళ్లికి ముందు బ్యూటీ పార్లర్‌కు వెళ్లడం, స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండేందుకు కొన్ని నెలల ముందు నుంచే డైట్ మెయింటేన్ చేయడం చేస్తుంటారు. పెళ్లికి ముందు ఫిట్‌గా ఉండాలంటే ఆహారం విషయంలో శ్రద్ధ వహించడం తప్పనిసరి. మరి వివాహానికి ముందు ఎలాంటి డైట్ చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆరోగ్యకరమైన ఆహారం: వివాహానికి ముందు, బరువు తగ్గడం కోసం చాలా మంది రొటీన్ డైట్‌ను ఫాలో అవుతుంటారు. అంటే, సరిగా ఆహారం తినకుండా కడుపు మాడ్చుకోవడం చేస్తుంటారు. అయితే, ఇది పోషకాల లోపానికి కారణం అవుతుంది. బరువు తగ్గడం ముఖ్యమే కానీ, మంచి ఆహారం తీసుకుంటూ ఫిట్‌నెస్ సాధించడం అంతకంటే ముఖ్యం. ఆరోగ్యంగా ఉంటేనే, ఫిట్‌నెస్‌కు అర్థం.

ఎక్కువ నీరు: నీరు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతుంది. పెళ్లికి కొన్ని నెలల ముందు నుంచే శరీరానికి తగినంత నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. నీరు ఎక్కువగా తాగడం వల్ల చర్మం మెరుస్తుంది.

కూరగాయలు, పండ్లు: ఫిట్‌గా ఉండాలనుకునే వరుడు.. ఎక్కువగా పండ్లు, ఆకు కూరగాయలను ఆహారంలో తీసుకోవాలి. వీటిని తినడం వల్ల శరీరానికి విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా అందుతాయి.

కొత్త ప్రయోగాలు చేయడం మానుకోండి: బరువు తగ్గడానికి ఈ రోజుల్లో చాలా ట్రిక్స్ ట్రై చేస్తున్నారు. పెళ్లికి ముందు ఆహారంలో కొత్తగా ఏదైనా ప్రయత్నించడం మానుకోండి. ఈ పద్ధతి మీ ఆరోగ్యానికి, చర్మానికి హాని కలిగిస్తుంది.




