Telugu News » Photo gallery » Weight Loss Tips: High Cholesterol Level To control high cholesterol Add these fruits in your diet
High Cholesterol: ఈ పండ్లతో అధిక కొలెస్ట్రాల్‌కు, ఊబకాయానికి చెక్ పెట్టొచ్చు.. అవేంటో తెలుసుకోండి..
High Cholesterol Level: ఊబకాయంతో బాధపడేవారు.. అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి అనేక మందులు తీసుకోవడంతోపాటు పలు రకాల డైట్‌లను పాటిస్తుంటారు. ఇలాంటి పరిస్థితిలో ఆహారంలో కొన్ని పండ్లను చేర్చుకుంటే చాలా మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇవి పెరిగిన కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి.
అధిక కొలెస్ట్రాల్ కారణంగా అనేక గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పెరుగుతున్న కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి, మీరు అనేక రకాల ఆరోగ్యకరమైన ఆహారాలను ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.
1 / 6
ఆపిల్: అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి ఆపిల్ పండ్లను తినవచ్చు. ఇందులో పెక్టిన్ ఫైబర్ ఉంటుంది. ఇది పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి.
2 / 6
అవకాడో: అవకాడో పండ్లు కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి పని చేస్తాయి.
3 / 6
సిట్రస్ పండ్లు: సిట్రస్ పండ్లలో నారింజ, ద్రాక్షపండు, నిమ్మ వంటి పండ్లు ఉంటాయి. విటమిన్ సి పండ్లలో పెక్టిన్ ఫైబర్ ఉంటుంది. సిట్రస్ పండ్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అందువల్ల వాటిని ఆహారంలో చేర్చుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
4 / 6
బొప్పాయి: బొప్పాయిలో పొటాషియం, విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యంగా ఉండేందుకు ఇవి పనిచేస్తాయి. దీంతోపాటు బొప్పాయి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అందువల్ల దీనిని ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
5 / 6
ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే.. హై కోలెస్ట్రాల్‌కు చెక్ పెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.