AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dogs Wedding: సంప్రదాయం పద్దతిలో ఘనంగా కుక్కల పెళ్లి.. 500మందికి విందుభోజనం.. ఎక్కడంటే..

Dogs Wedding: గత కొంతకాలంగా కుక్కలు, పిల్లులు వంటి వాటికీ వేడుకలు సైతం జరిపిస్తున్నారు. పుట్టినరోజులు, సీమంతం.. ఇలా రకరకాల వేడుకలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఇరువురు వ్యక్తులు మరో అడుగు ముందుకేసి.. రెండు కుక్కలకు పెళ్లి.. ఘనంగా విందుభోజనం ఏర్పాటు చేశారు

Dogs Wedding: సంప్రదాయం పద్దతిలో ఘనంగా కుక్కల పెళ్లి.. 500మందికి విందుభోజనం.. ఎక్కడంటే..
Dogs Marriage
Surya Kala
|

Updated on: Jun 07, 2022 | 8:56 AM

Share

Dogs Wedding: కుక్క, పిల్లి వంటి పెంపుడు జతువులను యజమానులు ఎంతో ప్రేమగా చూసుకుంటారు.  తమ కుటుంబ సభ్యులతో సమానంగా ప్రేమిస్తారు. వాటితో సరదాగా గడుపుతారు. కొందరు తమ పెంపుడు జంతువులైన కుక్క, పిల్లి వంటివాటికి తమ ఆస్తులను సైతం రాసిన సందర్భాల గురించి తరచుగా వింటూనే ఉన్నాం. ఇక ఫ్యాషన్ షోలు సర్వసాధారణమే.. అయితే గత కొంతకాలంగా కుక్కలు, పిల్లులు వంటి వాటికీ వేడుకలు సైతం జరిపిస్తున్నారు. పుట్టినరోజులు, సీమంతం.. ఇలా రకరకాల వేడుకలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఇరువురు వ్యక్తులు మరో అడుగు ముందుకేసి.. రెండు కుక్కలకు పెళ్లి.. ఘనంగా విందుభోజనం ఏర్పాటు చేశారు.. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఉత్తర్‌ప్రదేశ్‌ హమీర్‌పుర్‌ జిల్లాలోని సుమెర్‌పుర్‌లో ఇద్దరు పూజారులు వినూత్నంగా ఆలోచించారు. తమ పెంపుడు కుక్కలకు వివాహం జరిపించాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా హిందూ సంప్రదాయం ప్రకారం వారి పెంపుడు శునకాలకు వివాహం జరిపించారు. సౌంఖర్‌ అడవుల్లో మనసర్‌ బాబా శివాలయం ఉంది. ఆ గుడిలో ప్రధాన పూజారి స్వామి ద్వారకా దాస్‌ మహారాజ్‌ అనే అతనికి ఓ పెంపుడు కుక్క ఉంది. ఈ కుక్కకు వివాహం చేయాలని అనుకున్న ఆయన.. పరఛాచ్‌లోని భజరంగబలి ఆలయ పూజారి అర్జున్‌ దాస్‌ పెంచుకునే ఆడ కుక్కతో వివాహం నిశ్చయించారు. జూన్‌ 5న మూహుర్తం పెట్టి తన శిష్యులను, భక్తులను ఆహ్వానించారు. వైభవంగా వివాహం జరిపించి, 500 మందితో భారీ ఊరేగింపు నిర్వహించారు. పెళ్లి అనంతరం అతిథులకు రకరకాల వంటకాలతో భోజనాలు కూడా వడ్డించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..