Farmers: రైతులకు గుడ్‌న్యూస్.. ఇకపై మొబైల్ ఫోన్లకే ఆ వివరాలు.. ఐఎండీ సరికొత్త నిర్ణయం..
ప్రస్తుతం, IMD దేశంలోని 28 మిలియన్లకు పైగా రైతులకు SMS, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్, IFFCO కిసాన్ సంచార్ లిమిటెడ్, రిలయన్స్ ఫౌండేషన్, మహీంద్రా సమృద్ధి వంటి వివిధ మాధ్యమాల ద్వారా వివిధ భాషలలో ప్రతి వారం పంట నిర్దిష్ట వ్యవసాయ-వాతావరణ సలహాలను అందిస్తుంది.
రైతుల(Farmers) ఆదాయాన్ని రెట్టింపు చేయడంతోపాటు వ్యవసాయాన్ని (Agriculture)లాభసాటిగా మార్చడానికి, భారత వాతావరణ శాఖ (IMD) ప్రస్తుతం రైతులకు మరింత సహాయం చేసేందుకు సిద్ధమైంది. రైతులకు వారి స్థానిక భాషలో SMS ద్వారా వాతావరణ సూచనను అందించే పథకంపై IMD పని చేస్తోంది. ఈ సేవ పూర్తిగా ఉచితంగా అందించనుంది. ఈ సేవ కోసం హెల్ప్ లైన్ నంబర్ జారీ చేయనున్నారు. దేశంలోని ఏ ప్రాంతమైన రైతు తన గ్రామం లేదా బ్లాక్ కోసం రాబోయే ఐదు రోజులలో వర్షం, ఉష్ణోగ్రత, తేమ, గాలి వేగం వంటి వాతావరణ సమాచారాన్ని(Weather Forecast) పొందవచ్చు. IMD ప్రత్యేక బృందం ఈ అప్లికేషన్‌పై పని చేస్తుంది. SMS ద్వారా ప్రాంతీయ భాషలో సమాచారాన్ని అందించనుంది.
ప్రాంతీయ స్థాయిలో వాతావరణ సంబంధిత సమాచారం అందుబాటులో ఉండటం వల్ల రైతులు ఎరువులు, ఇతర ఇన్‌పుట్‌ల వినియోగం, నీటిపారుదల వంటి వ్యవసాయ కార్యకలాపాలపై తగిన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. సాధారణ పౌరులు కూడా కామన్ ఫోన్ నంబర్‌ని ఉపయోగించి తమ ప్రాంతంలో వాతావరణ సూచనను తెలుసుకోవచ్చు.
ప్రస్తుతం ఉన్న వ్యవస్థ ఏమిటి?
ఎందుకంటే చాలా మంది రైతులకు స్మార్ట్‌ఫోన్‌లు లేవు. దీని కారణంగా వారు వాతావరణ సంబంధిత సమాచారాన్ని పొందలేరు. ప్రస్తుత సలహా వ్యవస్థ ఒక జిల్లాకు సంబంధించినది, అలాగే స్వచ్ఛందంగా ఉంటుంది. ఇప్పుడు కొత్త పథకం కింద అందించే సమాచారం ఆ ప్రాంతానికి మరింత నిర్దిష్టంగా ఉంటుంది. తద్వారా ఇది రైతుకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
ప్రస్తుతం, మొబైల్ యాప్ మేఘదూత్, IMD, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంయుక్త చొరవ, ఇంగ్లీష్, స్థానిక భాషలలో పంటలు, పశువులకు సంబంధించి జిల్లా స్థాయి సలహాలను అందిస్తుంది. వర్షపాతం, ఉష్ణోగ్రత, తేమ, గాలి వేగంపై సమాచారాన్ని సేకరించేందుకు IMD జిల్లా స్థాయిలో సుమారు 200 వ్యవసాయ-ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
గ్రామీణ వ్యవసాయ వాతావరణ సేవ కింద, వాతావరణ శాఖ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న వివిధ ICAR సంస్థల సహకారంతో జిల్లా స్థాయి వాతావరణ సూచనలను వారానికి రెండుసార్లు అందిస్తుంది. రానున్న ఐదు రోజుల జిల్లా స్థాయి వాతావరణ సూచనలో వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలి వేగం, దిశ, తేమ, మేఘాల సమాచారం ఉంటుంది.
ప్రస్తుతం, IMD దేశంలోని 28 మిలియన్లకు పైగా రైతులకు SMS, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్, IFFCO కిసాన్ సంచార్ లిమిటెడ్, రిలయన్స్ ఫౌండేషన్, మహీంద్రా సమృద్ధి వంటి వివిధ మాధ్యమాల ద్వారా వివిధ భాషలలో ప్రతి వారం పంట నిర్దిష్ట వ్యవసాయ-వాతావరణ సలహాలను అందిస్తుంది. రైతులు వారి భాషలోనే అగ్రోమెట్ సలహాను పొందవచ్చు. దీంతో రోజువారీ వ్యవసాయ పనులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో అది వారికి చాలా సహాయపడుతుంది. దీంతో తమ స్థాయిలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ పనులు ప్లాన్ చేసుకోవడంతోపాటు పంటల దిగుబడిని కూడా పెంచుకోవచ్చు. ఇది మన అన్నదాతల ఆదాయాన్ని పెంచడంలో ఖచ్చితంగా సహాయపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.