AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతి

రాజస్థాన్(Rajasthan) లోని బార్మర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ట్రక్కు ఢీ కొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సోమవారం రాత్రి ఈ ప్రమాదం...

పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతి
Rajasthan Accident
Ganesh Mudavath
|

Updated on: Jun 07, 2022 | 10:14 AM

Share

రాజస్థాన్(Rajasthan) లోని బార్మర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ట్రక్కు ఢీ కొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. గూడమలాని(Gudamalani High Way) హైవేపై ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటన తర్వాత కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారులో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తున్న సమంలో గూడమలాని హైవేపై కారు వేగంగా ట్రక్కును ఢీ కొట్టింది. సమాచారం అందుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని కారులో ఉన్న మిగతా వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా, తీవ్రంగా గాయపడ్డ నలుగురిని గూడమలానీ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం సాంచోర్​కు తరలించారు.

ఈ ప్రమాదంలో పెళ్లికి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గమ్యం చేరుకోవాల్సిన ప్రాంతానికి 8 కిలో మీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరగడంతో మృతుల కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..