Indonesia Open: చివరి నిమిషంలో భారత్‌కు షాక్.. ఇండోనేషియా ఓపెన్‌ నుంచి తప్పుకున్న కీలక ప్లేయర్లు..

ఇండోనేషియా ఓపెన్ ప్రారంభానికి ముందు భారత్‌కు మూడు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. దేశంలోని ముగ్గురు దిగ్గజ ప్లేయర్లు ఉపసంహరణతో టీమిండియా కాస్త బలహీనపడింది.

Indonesia Open: చివరి నిమిషంలో భారత్‌కు షాక్.. ఇండోనేషియా ఓపెన్‌ నుంచి తప్పుకున్న కీలక ప్లేయర్లు..
Indonesia Open
Venkata Chari

|

Jun 07, 2022 | 6:12 AM

మంగళవారం ప్రారంభమైన ఇండోనేషియా ఓపెన్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్ (Saina Nehwal), పారుపల్లి కశ్యప్‌‌తో పాటు భారత్‌కు చెందిన థామస్ కప్ విజయ వీరుడు హెచ్‌ఎస్ ప్రణయ్(HS. Prannoy) చివరి నిమిషంలో తమ పేర్లను ఉపసంహరించుకున్నారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం రాత్రి వెల్లడించారు. తన భర్త కశ్యప్ కండరాల బెడద నుంచి కోలుకోలేకపోవడంతో ఇండోనేషియా ఓపెన్ నుంచి వైదొలిగిన సమయంలో పనిభారం కారణంగా సైనా ఈ టోర్నీలో ఆడకూడదని నిర్ణయించుకుంది. ఇంతకుముందు ఈ ముగ్గురు ఆటగాళ్లు ఆడుతున్నట్లు వార్తలు వచ్చాయి. అందువల్ల భారతదేశం మంచి ప్రదర్శన ఇస్తుందని భావించారు. అయితే ఈ నిర్ణయంతో భారతదేశానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది.

కశ్యప్ వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ, “సెలెక్షన్ ట్రయల్స్‌కు ముందు నాకు కండరాలు ఒత్తిడికి గురయ్యాయి. కోలుకోవడానికి ఏడు వారాలు పట్టింది. ఆ తర్వాత నాకు చీలమండ సమస్య వచ్చింది. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. కానీ, నా ఫిట్‌నెస్‌కి తిరిగి రావడానికి సమయం పడుతుంది. రాబోయే నాలుగు టోర్నీల్లో నేను ఆడగలనని ఆశిస్తున్నాను’ అని తెలిపాడు.

సైనా కూడా బాగానే ఉంది

సైనా గురించి సమాచారం ఇస్తూ, కశ్యప్ మాట్లాడుతూ, “చాలా టోర్నమెంట్‌లు ఉన్నందున సైనా వైదొలిగింది. కాబట్టి ఇండోనేషియా టోర్నీ నుంచి తప్పుకోవాలని ఆమె భావించింది” అని పేర్కొన్నాడు.

తదుపరి టోర్నీలపై దృష్టి పెట్టాలని..

గత నెలలో జరిగిన థామస్ కప్‌ను భారత్ గెలవడంలో ప్రణయ్ కీలక పాత్ర పోషించాడు. భారత్ తొలిసారిగా థామస్ కప్‌ను గెలుచుకుంది. తదుపరి నాలుగు టోర్నీలపై దృష్టి సారించేందుకు ఈ టోర్నీ నుంచి వైదొలిగాడు. అతను మాట్లాడుతూ, “నేను ఇండోనేషియా ఈవెంట్‌ నుంచి తప్పుకుంటున్నాను. తదుపరి టోర్నీలో ఆడతాను. నేను ప్రస్తుతం బాగానే ఉన్నాను. రాబోయే కొన్ని వారాలకు సిద్ధంగా ఉంటాను” అని పేర్కొన్నాడు.

తదుపరి లక్ష్యంపై..

థామస్ కప్ హీరో కిదాంబి శ్రీకాంత్ గైర్హాజరీలో మెయిన్ డ్రాలో సేన్, సమీర్ వర్మతో పాటు క్వాలిఫయర్స్‌తో తలపడనున్నారు. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత సింధు, థాయ్‌లాండ్ ఓపెన్‌లో సెమీ-ఫైనల్‌కు దూరమైన తర్వాత ఈసారి మరింత ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. పురుషుల డబుల్స్‌లో మను అత్రి, సుమీత్‌రెడ్డి జోడీపై దేశం ఆశలు పెట్టుకుంది. మహిళల డబుల్స్ విభాగంలో రెండు భారత జోడీలు పోటీపడనున్నాయి. టోర్నమెంట్ మహిళల డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప, ఎన్ సిక్కి రెడ్డితో పాటు, సిమ్రాన్ సింఘి, రితికా థాకర్ తమ లక్‌ను పరీక్షించుకోనున్నారు.

ఇవి కూడా చదవండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu