Art Museum: ప్రేయసితో గొడవపడిన ప్రియుడు.. కోపంతో మ్యూజియంలో అరుదైన వస్తువులు ధ్వసం… వీటి విలువ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్..

ఆ యువకుడు చేసిన పని తెలిస్తే.. షాక్ తినాల్సిందే.. ఎందుకంటే ఆ యువకుడు ప్రేమికురాలి మీద కోపంతో అరుదైన, విలువైన కోట్ల విలువజేసే కళాకండాన్ని ధ్వంసం చేశాడు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.

Art Museum: ప్రేయసితో గొడవపడిన ప్రియుడు.. కోపంతో మ్యూజియంలో అరుదైన వస్తువులు ధ్వసం... వీటి విలువ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్..
Dallas Museum Of Art
Follow us
Surya Kala

|

Updated on: Jun 07, 2022 | 7:24 AM

Dallas Art Museum: ప్రేమికుల మధ్య చిన్న చిన్న తగాదాలు సర్వసాధారణం. అయితే అలా ప్రేయసితో గొడవపడిన యువకుడు తన కోపాన్ని బాధను మందు తాగడంతో.. లేక కొన్ని రోజులు మాట్లాడకుండా ఉండమో ఇలా రకరకాలుగా చూపిస్తాడు.. అయితే తాజాగా ఓ యువకుడు.. ప్రియురాలితో గొడవపడి ఆ కోపంతో చేసిన పనికి ఏకంగా కోట్లు విలువజేసే వస్తువులు బలయ్యాయి. ఆ యువకుడు చేసిన పని తెలిస్తే.. షాక్ తినాల్సిందే.. ఎందుకంటే ఆ యువకుడు ప్రేమికురాలి మీద కోపంతో అరుదైన, విలువైన కోట్ల విలువజేసే కళాకండాన్ని ధ్వంసం చేశాడు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళ్తే..

అమెరికాలోని డల్లాస్ లో ఫేమస్ ప్లేస్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లోకి 21 ఏళ్ల బ్రియాన్ హెర్నాండెజ్ అనే యువకుడు  చొరబడ్డాడు. అయితే మ్యూజియం లోకి చేరుకున్న బ్రియాన్ అక్కడ ఉన్న అరుదైన వస్తువులను చూడడానికి వెళ్ళలేదు.. అందించిన వస్తువులను అందినట్లు ధ్వసం చేశాడు. 6 వ శతాబ్దపు గ్రీకు విగ్రహం, 450 BC నాటి కుండతో సహా విలువైన కళాఖండాలు ధ్వసం అయిన విషయం మ్యూజియం నిర్వాహకుల దృష్టికి చేరుకుంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. మ్యూజియం ఎంట్రెన్స్ గెట్ దగ్గర రాత్రి కుర్చీలో కూర్చున్న బ్రియాన్ ను పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే పోలీసుల విచారణలో కళాకండాలను ధ్వసం ఎందుకు చేశాడో బ్రియాన్ చెప్పిన సమాధానం విని పోలీసులు షాక్ తిన్నారు. ఎందుకంటే తాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రియురాలితో గొడవ జరిగిందని.. ఆ కోపాన్ని తట్టుకోలేక.. కోపాన్ని తగ్గించుకోవడానికి మ్యూజియంలో అరుదైన వస్తువులను పగలగొట్టినట్లు చెప్పాడు.

ఇవి కూడా చదవండి

అయితే బ్రియాన్ ధ్వసం చేసిన అరుదైన విలువైన పురాతన కళాకండాలు ఉన్నాయని పోలీస్లు చెప్పారు. వాటిల్లో ఒక కైలిక్స్ హెరాకిల్స్ , నెమియన్ లయన్ విగ్రహం ఖరీదు భారత దేశ కరెన్సీలో సుమారు రూ.77 లక్షలు విలువైంది ఉన్నది.. ఇక ఆ యువకుడు నష్టము చేసిన వస్తువుల విలువ 5.2 మిలియన్ డాలర్లు మన దేశ కరెన్సీలో సుమారు.. రూ.40.37 కోట్లు ఉంటుందని మ్యూజియం నిర్వహకులు అంచనా వేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే