Brazil Man: రివెంజ్ ప్రేమ.. తాను బ్రేకప్ చెప్పిన ప్రేయసి ముఖంపై తన పేరు టాటూ వేసిన యువకుడు..

తనకు బ్రేకప్ చెప్పిన అమ్మాయిని కిడ్నప్ చేసి.. ఆమె ముఖం మీద తన పేరును టాటూ వేశాడు .. పోలీసులకు యువతి ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఆ యువకుడు కటకటాలను లెక్కిస్తున్నాడు

Brazil Man: రివెంజ్ ప్రేమ.. తాను బ్రేకప్ చెప్పిన ప్రేయసి ముఖంపై తన పేరు టాటూ వేసిన యువకుడు..
Brazilian Man
Follow us
Surya Kala

|

Updated on: Jun 06, 2022 | 7:07 AM

Brazil Man: కాలంతో పాటు మనుషుల నడవడికలో ఆలోచనలో మార్పులు వచ్చాయి. పూర్వం ప్రేమించిన వారు దక్కకపోతే.. త్యాగం చేసేవారని.. చరిత్ర కథనాల్లో చదువుకుంటున్నాం.. అయితే ఇప్పుడు అన్నిటిలోనూ మార్పులు వచ్చినట్లు.. ప్రేమ విషయంలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. తమకు దక్కనివారు ఇంకెవరికి దక్కకూడదని కొందరు ఆలోచిస్తుంటే.. మరికొందరు.. తమను ప్రేమించి మోసం చేశారంటూ.. వీధికెక్కుతూ తమ నిరసన తెలుపుతున్నారు. అయితే ఇప్పుడు యువతి యువకుల్లో ఎక్కువగా తమతో విడిపోయిన వారిపై రివైంజ్ తీర్చుకోవాలనే కోరిక ఎక్కువ కనిపిస్తోంది. ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది.. తాజాగా బ్రెజిల్ దేశంలో జరిగిన సంఘటన.. ఓ యువకుడు.. తనకు బ్రేకప్ చెప్పిన అమ్మాయిని కిడ్నప్ చేసి.. ఆమె ముఖం మీద తన పేరును టాటూ వేశాడు .. పోలీసులకు యువతి ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఆ యువకుడు కటకటాలను లెక్కిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

బ్రెజిల్‌లోని సావో పాలో రాష్ట్రానికి చెందిన 18 ఏళ్ల తయానే కాల్డాస్ అనే యువతి గత శుక్రవారం పాఠశాలకు వెళుతుండగా, ఆమె మాజీ ప్రియుడు గాబ్రియెల్ కొయెల్హో(20) కిడ్నాప్ చేశాడు. తయానేని తన కారులోకి బలవంతంగా ఎక్కించుకుని ఎక్కి తౌబాటే మున్సిపాలిటీలోని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఆ యువకుడికి భయపడిన తయానే .. అతను చెప్పినట్లు విన్నది..

కోయెల్హో తన పూర్తి పేరును మాజీ ప్రేయసి.. తయానే ముఖం కుడి వైపున, ఆమె చెవి నుండి గడ్డం వరకు టాటూగా వేయించాడు. ఆ సమయంలో  తయానే పచ్చబొట్టు చేయడాన్ని తిరస్కరించనప్పటికీ..  గాబ్రియేల్  తన పేరుని ఆ యువతి ముఖంపై టాటూగా వేసినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. మరుసటి రోజుతయానే తల్లి తన కూతురు కనిపించడం లేదని.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. తయానే ఉన్న ప్రదేశాన్ని గుర్తించి.. కోయెల్హో ఇంటికి వెళ్లారు.

ఇవి కూడా చదవండి

అక్కడ టాటూ తో ఉన్న కూతురుని చూసిన తల్లి.. ఇంటికి తీసుకుని వచ్చింది. అనంతరం కూతురు ముఖంపై పచ్చబొట్టగా  తన పేరుని వేయించిన మాజీ లవర్ పై పోలీసులకు ఫిర్యాదు చేయమని దైర్యం చెప్పింది. తాయనే ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాబ్రియేల్ కోయెల్హోను శనివారం అదుపులోనికి తీసుకున్నారు. అయితే

గాబ్రియేల్ తండ్రి తయానే ముఖంపై తన కొడుకు టాటూ వేయించడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు.. కొడుకు చేసిన పనిని సమర్ధిస్తూ.. తాయానే తన ముఖంపై పచ్చబొట్టు వేసినందుకు సంతోషంగా ఉందని తన వాదనను వినిపించాడు.

తన మాజీ లవర్ ఆలోచనలకు తాను భయపడుతున్నాని చెప్పింది తయానే. అంతేకాదు..  “ఈ రోజుల్లో అమల్లో ఉన్న చట్టాల వలన అతను ఎక్కువ కాలం  జైలులో ఉండడని అందరికీ తెలుసు అందుకనే తాను ఇప్పుడు అతనికి భయపడుతున్నానని తెలిపింది. తయానే  సోషల్ మీడియా వేదికగా తన ఆలోచనలు, భయాలను వెల్లడించింది. దీంతో   ఆమెకు సహాయం చేయడానికి అనేక బ్రెజిలియన్స్ ముందుకొచ్చారు. ఇక ఆమె ముఖం మీద ఉన్న టాటూ ని తొలగించడానికి టాటూ రిమూవల్ దుకాణాలు కూడా ముందుకొచ్చాయి.

బుధవారం తన మొదటి లేజర్ రిమూవల్ సెషన్‌కు హాజరైన ఆమె ముఖంపై ఉన్న టాటూను చెరిపేసే ప్రయత్నం మొదలు పెట్టింది. అయితే ఆ యువతి శరీరంపై  కోయెల్హో పేరుతో ఉన్న మరో రెండు టాటూలు ఉన్నాయని.. అవి కూడా తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

వీరిద్దరూ 2019లో డేటింగ్ ప్రారంభించారు, మొదట్లో అంతా సవ్యంగానే ఉంది. రిలేషన్ ఏర్పడిన దాదాపు ఒక సంవత్సరం తర్వాత..  టాటూ ఆర్టిస్ట్ అయిన కోయెల్హో ఆలోచన తీరు మారింది. అనుమానం మొదలు అయ్యి..  యువతిపై దాడి చేయడం ప్రారంభించాడు. దీంతో తాయానే తల్లి అతన్ని విడిచిపెట్టమని కూతురుకి సూచించింది. ఈ మేరకు ఇద్దరిని ఒప్పించింది. అయితే ఎనిమిది నెలల తర్వాత ఇద్దరూ కలిశారు. అప్పుడు తాను ఎప్పుడు తాయానేను ఇబ్బంది పెట్టనని.. ఇకపై ఆమెను కొట్టనని వాగ్దానం చేయడంతో తిరిగి కలుసుకున్నారు. అతను తన మాటని నిలబెట్టుకోలేదు.. మళ్ళీ యువతిని హిసించడం ప్రారంభించాడు.  దీంతో ప్రియుడు హింసను తట్టుకోలేక మళ్ళీ బ్రేకప్ చెప్పేసింది. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు ఆమెను కొన్ని నెలల పాటు సావో పాలోకు పంపించారు. ఆమె తిరిగి టౌబాటేకు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ రంగంలోకి దిగిన  మాజీ ప్రియుడు గాబ్రియేల్ ఆమెను మళ్లీ బెదిరించడం ప్రారంభించినట్లు సమాచారం.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..