AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Luckiest Woman: ఓ మహిళను రాత్రికి రాత్రే లక్షాధికారిని చేసిన ఫ్రీగా దొరికిన సోఫా.. ఆ మహిళ నిర్ణయంపై సర్వత్రా హర్షం

అమెరికాలో ఉంటున్న ఓ మహిళకు ఉచితంగా సోఫా దొరికింది. అయితే ఈ సోఫా ఆ మహిళకు అదృష్టాన్ని తీసుకుని వెళ్ళింది. రాత్రికి రాత్రే ధనవంతురాలిని చేసింది ఆ సోఫా

Luckiest Woman: ఓ మహిళను రాత్రికి రాత్రే లక్షాధికారిని చేసిన ఫ్రీగా దొరికిన సోఫా.. ఆ మహిళ నిర్ణయంపై సర్వత్రా హర్షం
California Woman
Surya Kala
|

Updated on: Jun 06, 2022 | 7:47 AM

Share

Luckiest Woman: అదృష్టం ఎవరిని ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పడం మానవులకు సాధ్యంకాదు. సమయం, లక్కు కలిసి వస్తే.. కష్టపడకుండానే తాము కోరుకున్నవన్నీ కొందరి కాళ్ళ దగ్గరకు చేరుకుంటాయి. అదృష్టం కలిసి వస్తే  పనికి రావనుకున్న వస్తువులే రాత్రికి రాత్రే ధనవంతువులవుతారు. ఇందుకు సజీవ ఉదాహరణగా నిలుస్తుంది అమెరికాకు చెందిన ఓ మహిళ. వివరాల్లోకి వెళ్తే..

అమెరికాలోని కాలిఫోర్నియాలో నివసిస్తున్న విక్కీ ఉమోడు అనే మహిళకు ఇటీవల ఉచితంగా ఓ సోఫా లభించింది. అయితే ఈ సోఫా తన అదృష్టాన్ని మార్చబోతుందని అప్పుడు విక్కీకి తెలియదు. సోఫా మహిళ ఆర్ధిక స్థితిని మార్చేసింది. ఆమె రాత్రికి రాత్రే ధనవంతురాలైంది. ఈ సంఘటన గురించి విన్నవారు షాక్ తినకుండా ఉండరు.

వాస్తవానికి.. ఆ మహిళ తన ఇంటిలో పెట్టుకోవడానికి ఫర్నిచర్ కొనాలనుకుంది. అందుకని ఆన్‌లైన్ లో సోఫా వివరాలను వెదకడం ప్రారంభించింది. అయితే ఉచితంగా పాత సోఫా దొరికింది. దీంతో తన కోరిక తీరిందంటూ.. సంతోషంగా తన ఇంటికి తెచ్చుకుంది. ఇంటికి వస్తూనే సోఫాని  క్లీన్ చేయడం మొదలు పెట్టింది. సోఫాని శుభ్రం చేస్తున్న సమయంలో ఆమెకు షాకింగ్ దృశ్యం కనిపించింది.

ఇవి కూడా చదవండి

సోఫా నుంచి 30 లక్షల రూపాయలు  న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం..  సోఫాను శుభ్రపరిచే సమయంలో.. ఆ మహిళకు 36 వేల డాలర్లు అంటే మనదేశ కరెన్సీ నుంచి సుమారు 30 లక్షల రూపాయలు లభించాయి. ఇప్పుడు ఒక్కసారిగా అంత డబ్బు చూసి షాక్ తిన్నది.   తర్వాత తేరుకున్నాక ఆమె ఆనందానికి చోటు లేదు.

నివేదికల ప్రకారం.. లోపల ఒక కవరులో డాలర్లు ఉంచి కుషన్ లోపల పెట్టారు. సోఫాను శుభ్రం చేస్తున్న సమయంలో  కుషన్ నుంచి బయటపడిన నగదును లెక్కించగా దాదాపు 30 లక్షల రూపాయలు ఉన్నట్లు తేలింది. అయితే తనకు అనుకోకుండా లభించిన డబ్బుని చూసిన తర్వాత విక్కీ తీసుకున్న నిర్ణయం పై ఇప్పుడు సర్వత్రా ప్రశంసల వర్షం కురిపిస్తోంది.  తనకు దొరికిన లక్షల డబ్బును తన వద్ద ఉంచుకోకుండా సోఫా అసలు యజమానికి తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నది. సోఫా యజమాని గురించి వివరాలు సేకరించి.. అతనికి తనకు దొరికిన డబ్బుని తిరిగి ఇచ్చింది.  తనకు పోయిన డబ్బులు దొరికిన సోఫా యజమాని సంతోషంతో.. ఆమెకు కొంత మొత్తం ఇచ్చాడు. కొత్త రిఫ్రిజిరేటర్ కోసం విక్కీకు సుమారు లక్షన్నర రూపాయలను గిఫ్ట్ గా ఇచ్చాడు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.