Viral Video: క్లాస్ రూమ్‌లో క్లాసీగా నిద్రపోతున్న బాలుడు.. వీడియో చూస్తే మీ బాల్యం కనులముందుకే..

Viral Video: ఓ చిన్నారి బాలుడు స్కూల్ లో కూర్చుని పాఠాలు వినడానికి పడుతున్న పడుతున్న అవస్థలు వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూస్తుంటే.. మీ చిన్నతనం రోజులు క్లాస్ రూమ్ గుర్తుకు వస్తుంది.

Viral Video: క్లాస్ రూమ్‌లో క్లాసీగా నిద్రపోతున్న బాలుడు.. వీడియో చూస్తే మీ బాల్యం కనులముందుకే..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jun 11, 2022 | 5:56 PM

Viral Video: ఈరోజుల్లో సోషల్ మీడియా క్రేజ్ జనాల్లో బాగా ఉంది. ప్రతిరోజూ ఏదో ఒక వీడియో జనంలో చర్చనీయాంశం అవుతూనే ఉంది. కొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలు అయితే.. మరొకొన్ని ప్రకృతిలో వింతలు.. ఇలా రకరకాలు వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చే కొన్ని వీడియోలు ఎప్పుడూ సరికొత్తగా అనిపిస్తాయి. ఆలాంటి వీడియోలు ఎన్ని చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తాయి. తాజాగా ఓ చిన్నారి బాలుడు స్కూల్ లో కూర్చుని పాఠాలు వినడానికి పడుతున్న పడుతున్న అవస్థలు వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూస్తుంటే.. మీ చిన్నతనం రోజులు క్లాస్ రూమ్ గుర్తుకు వస్తుంది.

మీ చిన్నతనంలో క్లాస్‌రూమ్‌లో మాస్టారు పాఠాలు చెబుతుంటే .. ఆ సమయంలో కళ్ళు బరువెక్కుతూ.. నిద్రించడానికి ఏదో ఒక మార్గం వెతుక్కున్న సందర్భం తప్పనిసరిగా గుర్తుకొస్తుంది. ఈ వీడియోలో కనిపించిన పిల్లవాడు తన సీటుపై సంతోషంగా నిద్రపోతున్నాడు.

ఇక్కడ వీడియో చూడండి

వైరల్ అవుతున్న వీడియో ప్రాథమిక పాఠశాలకు చెందినదిగా తెలుస్తోంది. టీచర్ క్లాస్ తీసుకుంటున్న సమయంలో..  క్లాసులో చదువుతున్న పిల్లలు కనిపిస్తున్నారు. అయితే క్లాస్ మధ్యలో ఒక పిల్లవాడు  చాలా సంతోషంగా నిద్రపోతున్నాడు. తన చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోడు. ఈ సమయంలో, అతని దృష్టి మొత్తం నిద్రపై మాత్రమే ఉంటుంది. ఈ అందమైన చిన్న బాలుడి నిద్ర చాలా అందంగా ఉంది

ఈ ఫన్నీ వీడియోను Earth.brains అనే ఖాతా ద్వారా Instagram లో షేర్ చేశారు. ఈ చిన్నారి బాలుడి నిద్రని  19 వేల మందికి పైగా లైక్ చేశారు. ఒక వ్యక్తి  ‘హే-హే తాను తన చిన్నతనంలో సరిగ్గా ఇలాగే ఉండేవాడిని’ అని కామెంట్ చేశారు.  మరొక వినియోగదారు ఇలా వ్రాశాడు, ‘ఈ వీడియో చూసిన తర్వాత, నా చిన్ననాటి జ్ఞాపకం వచ్చిందని అన్నారు. మరొకరు.. తాను ఇంటి పని కారణంగా రాత్రంతా నిద్రపోలేకపోయానని అంటూ బాధపడుతూ సరదాగా కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..