IND vs SA T20 Series: లైవ్ మ్యాచ్‌లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ప్రేక్షకులు.. వైరల్ వీడియో..

ఆదివారం (జూన్ 12) కటక్ వేదికగా జరగనున్న రెండో మ్యాచ్‌లో భారత జట్టు ముఖ్యంగా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంది. తొలి మ్యాచ్‌లో బౌలర్లంతా భీకరంగా పరుగులు ఇవ్వడంతో టీమిండియా భారీ స్కోర్ చేసినా..

IND vs SA T20 Series: లైవ్ మ్యాచ్‌లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ప్రేక్షకులు.. వైరల్ వీడియో..
Ind Vs Sa T20 Series
Follow us
Venkata Chari

|

Updated on: Jun 11, 2022 | 1:28 PM

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత(IND vs SA) జట్టుకు శుభారంభం లభించలేదు. గురువారం (జూన్ 9) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ప్రస్తుతం రిషబ్ పంత్ నేతృత్వంలోని టీమ్ ఇండియా తదుపరి మ్యాచ్‌లో విజయం సాధించేందుకు ప్లాన్ చేస్తుందనండంలో ఎలాంటి సందేహం లేదు. తొలి మ్యాచ్‌లో మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య ఆసక్తికర పోరు సాగింది. అదే సమయంలో మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఎపిసోడ్‌లో, గ్రౌండ్‌లోని ఈస్ట్ స్టాండ్స్‌లో ఆటను చూడటానికి వచ్చిన కొంతమంది ప్రేక్షకులు తీవ్రంగా కొట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. అనంతరం భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని ఎలాగోలా ఈ కుమ్ములాటను సద్దుమణిగించారు.

ఆదివారం (జూన్ 12) కటక్ వేదికగా జరగనున్న రెండో మ్యాచ్‌లో భారత జట్టు ముఖ్యంగా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంది. తొలి మ్యాచ్‌లో బౌలర్లంతా భీకరంగా పరుగులు ఇవ్వడంతో టీమిండియా భారీ స్కోర్ చేసినా.. కాపాడుకోలేకపోయింది. అనుభవజ్ఞులైన బౌలర్లు భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్ వారి స్పెల్‌లో తలో 43 పరుగులు ఇచ్చారు. స్పిన్ బౌలర్లు యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. చాహల్ 2.1 ఓవర్లలో 26 పరుగులు, అక్షర్ నాలుగు ఓవర్లలో 40 పరుగులు ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మిల్లర్ ముంచేశాడు..

తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు 212 పరుగుల లక్ష్యాన్ని సులువుగా ఛేదించింది. రాస్సీ వాన్ డెర్ డస్సెన్ 46 బంతుల్లో 75 పరుగులు, డేవిడ్ మిల్లర్ 31 బంతుల్లో 64 పరుగులు చేశారు. ఇద్దరు ఆటగాళ్లు భారత బౌలర్లను భీకరంగా బాదేసి నాలుగో వికెట్‌కు 64 బంతుల్లో అజేయంగా 131 పరుగులు జోడించారు. డేవిడ్ మిల్లర్ తన ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు కొట్టారు. కాగా, డస్సెన్ ఐదు సిక్సర్లు, నాలుగు ఫోర్లు బాదాడు.