Mithali Raj: టీమిండియా సూపర్ ఉమెన్ పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా? అసలు కారణం వాళ్లేనంట..

39 ఏళ్ల మిథాలీ రాజ్ సింగిల్‌గానే లైఫ్‌ను లీడ్ చేస్తోంది. అయితే, తను ఎందుకు పెళ్లి చేసుకోలేదనే విషయాన్ని 2018లోనే వెల్లడించింది. తాజాగా రిటైర్మెంట్ ప్రకటనతో మరోసారి పెళ్లి వార్తలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

Mithali Raj: టీమిండియా సూపర్ ఉమెన్ పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా? అసలు కారణం వాళ్లేనంట..
Mithali Raj
Follow us
Venkata Chari

|

Updated on: Jun 09, 2022 | 12:18 PM

భారత క్రికెట్ ప్రపంచంలో మిథాలీ రాజ్(Mithali Raj) ఎన్నో విజయాలు సాధించి, ఉమెన్స్ క్రీడాకారిణిగా ఎంతో పేరు తెచ్చుకుంది. 1999లో అరంగేట్రం చేసిన మిథాలీ.. ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. మహిళల క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచింది. మైదానంలో మిథాలీ రెచ్చిపోయే మిథాలీ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇప్పటి వరకు సింగిల్‌గానే ఉంది. తాజాగా అన్ని ఫార్మాట్ల నుంచి నిన్న రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ.. ఇకపై వ్యక్తి జీవితంలో సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనుందని తెలుస్తుంది. ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉన్న మిథాలీ.. రిటైర్మెంట్ తర్వాత ఏడడుగులు వేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె పెళ్లిపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటోదనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, తను ఎందుకు పెళ్లి చేసుకోలేదనే విషయాన్ని 2018లోనే వెల్లడించింది. తాజాగా రిటైర్మెంట్ ప్రకటనతో మరోసారి పెళ్లి వార్తలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

39 ఏళ్ల మిథాలీ రాజ్‌ రిలేషన్ షిప్ స్టేటస్‌పై ఇప్పటి వరకు పెద్దగా చర్చలు జరగలేదు. కాగా, 2018లో ఈ దిగ్గజ క్రికెటర్ కొన్ని కీలక విషయాలు మాత్రం వెల్లడించింది. స్పోర్ట్స్కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రిలేషిప్ స్టేటస్‌పై తొలిసారి మాట్లాడింది. పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ ఆలోచించలేదా అనిఅడిగినప్పుడు, మిథాలీ మాట్లాడుతూ.. చిన్నతనంలో తనకు అలాంటి ఆలోచనలు ఉండేవి. 22 ఏళ్ల వయసులో ఇంట్లో వాళ్లు సంబంధాలు వెతకడం ప్రారంభించారు. కానీ, ఆటకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండాలనే పెళ్లిని పక్కన పెట్టాను. అయితే, 27 ఏళ్ల వయసులో వివాహం చేసుకోవాలని అనుకున్నా. కానీ, చాలా మంది పెళ్లి తర్వాత క్రికెట్‌ని వదిలేయాలని చెప్పారు. దీంతో పెళ్లి ప్రతిపాదననే పక్కన పెట్టేశాను. నేను ఒంటరిగా ఉండటమే ఆనందంగా ఉంది’ అని పేర్కొంది.

మిథాలీ రాజ్ మాట్లాడుతూ, ‘నేను ఇంతకు ముందు రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. కానీ, ప్రస్తుతానికి నేను సింగిల్‌గా ఉన్నాను. ప్రపంచకప్‌లో బాగా ఆడటంపైనే నా దృష్టి ఉంది’ అంటూ పేర్కొంది. రిటైర్మెంట్ ప్రకటించడంతో తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్న మిథాలీ.. పెళ్లి విషయంలోనూ తన వైఖరిని మార్చుకోవచ్చని అంతా భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, టీమిండియా ఉమెన్స్ టీం తరపున 12 టెస్టులు ఆడిన మిథాలీ.. 232 వన్డేలు, 89 టీ20 మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించింది. ఇక పరుగుల విషయానికి వస్తే.. టెస్టుల్లో 699 పరుగులతోపాటు వన్డేల్లో 7805, టీ20ల్లో 2364 రన్స్ సాధించింది.