17 ఏళ్లకే ఐపీఎల్‌లోకి ఎంట్రీ.. కీలక ఇన్నింగ్స్‌కు దండం పెట్టిన కోహ్లీ.. కట్ చేస్తే.. రంజీల్లో సెంచరీలతో దూకుడు..

రాజస్థాన్ రాయల్స్‌‌కు వ్యతిరేకంగా అజేయంగా 45 పరుగులతో కీలక ఇన్నింగ్స ఆడడంతో డ్రెస్సింగ్ రూమ్‌కి తిరిగి వెళ్తున్నప్పుడు, RCB కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ యువకుడికి నమస్కరించాడు.

17 ఏళ్లకే ఐపీఎల్‌లోకి ఎంట్రీ.. కీలక ఇన్నింగ్స్‌కు దండం పెట్టిన కోహ్లీ.. కట్ చేస్తే.. రంజీల్లో సెంచరీలతో దూకుడు..
Sarfaraz Khan
Follow us

|

Updated on: Jun 07, 2022 | 12:36 PM

ముంబై కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ తుఫాను ఫామ్ కొనసాగుతోంది. రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ బ్యాట్ మరోసారి బౌలర్లను చిత్తు చేసింది. బెంగళూరులో ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సర్ఫరాజ్ కేవలం 140 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఈ సెంచరీతో ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు. ఈ సీజన్‌లో సర్ఫరాజ్ ఖాన్ 650కి పైగా పరుగులు చేశాడు. 623 పరుగుల మార్క్‌ను దాటగానే చేతన్ బిష్త్‌ను అధిగమించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సర్ఫరాజ్ కేవలం 5 ఇన్నింగ్స్‌ల్లో 150 కంటే ఎక్కువ సగటుతో ఈ ఫిగర్‌ను చేరడం విశేషం.

గత 13 రంజీ ఇన్నింగ్స్‌లలో సర్ఫరాజ్ ఖాన్ ఒక ట్రిపుల్ సెంచరీ, రెండు డబుల్ సెంచరీలు, రెండు సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో సర్ఫరాజ్ ఖాన్‌కు ఇది మూడో సెంచరీ. అలాగే, సర్ఫరాజ్ స్ట్రైక్ రేట్ కూడా 70 కంటే ఎక్కువగా నిలిచింది. ఉత్తరాఖండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సర్ఫరాజ్ 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తన సెంచరీతో పాటు, సర్ఫరాజ్ సువేద్ పార్కర్‌తో కలిసి 200 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని కూడా పంచుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. 21 పరుగుల వద్ద కెప్టెన్ పృథ్వీ షా ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్ కూడా 35 పరుగుల వద్ద ఔటయ్యాడు. అర్మాన్ జాఫర్ 60 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సువేద్ పార్కర్, సర్ఫరాజ్ ఖాన్ సెంచరీలతో రాణించి ఉత్తరాఖండ్‌ను పూర్తిగా వెనక్కు నెట్టారు.

ఇవి కూడా చదవండి

సర్ఫరాజ్ ఖాన్ 17 ఏళ్ల యువ క్రికెటర్‌గా రంజీ ట్రోఫీలో ముంబై తరపున ఆడాడు. ఆ తర్వాత 2014 ప్రపంచకప్‌లో ఆడిన భారత అండర్-19 జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. 19 ప్రపంచ కప్‌లో, అతను 70.33 సగటు, 105 స్ట్రైక్ రేట్‌తో 211 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లోనూ అతి పిన్న వయస్కుడిగా 2015 వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంతో ఎంట్రీ ఇచ్చాడు. రాజస్థాన్ రాయల్స్‌‌కు వ్యతిరేకంగా అజేయంగా 45 పరుగులతో కీలక ఇన్నింగ్స ఆడడంతో డ్రెస్సింగ్ రూమ్‌కి తిరిగి వెళ్తున్నప్పుడు, RCB కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ యువకుడికి నమస్కరించాడు.

Latest Articles