AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Cylinder: గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారికి కేంద్రం లాస్ట్ ఛాన్స్.. ఈ పని చేయకపోతే డబ్బులు కట్.. డెడ్ లైన్ ఇదే..

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు వాడుతున్న వినియోగదారులందరికీ కేంద్రం బిగ్ అలర్ట్ జారీ చేసింది. గ్యాస్ వినియోగదారులకు ఆధార్ ధృవీకరణ ఈకేవైసీని కేంద్రం తప్పనిసరి చేసింది. అక్రమ గ్యాస్ కనెక్షన్లు, సిలిండర్లను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎక్స్‌లో వివరాలు వెల్లడించింది.

Gas Cylinder: గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారికి కేంద్రం లాస్ట్ ఛాన్స్.. ఈ పని చేయకపోతే డబ్బులు కట్.. డెడ్ లైన్ ఇదే..
Lpg Gas Cylinder
Venkatrao Lella
|

Updated on: Feb 26, 2026 | 5:45 PM

Share

ప్రతీ ఆర్ధిక సంవత్సరంలో ఒకసారి గ్యాస్ వినియోగదారులు ఆధార్ బేస్డ్ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. 2025-26 ఆర్ధిక సంవత్సరం మరి కొద్ది రోజుల్లో ముగియనుంది. దీంతో మార్చి 31లోపు గ్యాస్ వినియోగదారులందరూ ఆధార్ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని కేంద్ర పెట్రోలియం, సహాజ వాయువు మంత్రిత్వశాఖ ప్రకటన జారీ చేసింది. ఈ ప్రక్రియ ఎలా చేసుకోవాలనే విషయాన్ని కూడా తెలియజేసింది. ఈ మేరకు ఎక్స్‌లో ప్రజలకు వివరాలు వెల్లలడించింది. ఈ డీటైల్స్ ఏంటో చూద్దాం.

వీలైనంత త్వరగా పూర్తి చేయండి

“LPG బయోమెట్రిక్ ఆధార్ ప్రామాణీకరణ లేదా e-KYC పూర్తి చేయడానికి చివరి తేదీ త్వరలో సమీపిస్తోంది. వినియోగదారులు ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. మీ LPG బయోమెట్రిక్ ఆధార్ ప్రామాణీకరణ లేదా e-KYCని పూర్తి చేయడానికి కొత్త, అనుకూలమైన మార్గం ఇప్పుడు అందుబాటులో ఉంది. ఆధార్ ఫేస్‌ఆర్‌డి యాప్‌తో పాటు మీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ మొబైల్ యాప్‌ని ఉపయోగించి మీ ఇంటి నుండే ఉచితంగా ప్రక్రియ పూర్తి చేయొచ్చు. మరిన్ని వివరాల కోసం https:// www.pmuy.gov.in/e-kyc.html లేదా మీ LPG డిస్ట్రిబ్యూటర్‌ను కూడా సంప్రదించవచ్చు.. లేదా టోల్-ఫ్రీ నంబర్‌ 1800 2333 555కు కాల్ చేయవచ్చు” అని కేంద్రం స్పష్టం చేసింది.

ఎలా చేయాలంటే..?

-https:// www.pmuy.gov.in/e-kyc.html లింక్ ఓపెన్ చేయండి -మీ గ్యాస్ కంపెనీ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోండి -ఆధార్ ఫేస్‌ఆర్‌డీ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి -మీ గ్యాస్ కంపెనీ యాప్‌లోని సూచనల ప్రకారం ఆధార్ ఫేస్‌ఆర్‌డీ యాప్ ద్వారా మీ ముఖాన్ని స్కాన్ చేసి ఆధార్ ధృవీకరణ పూర్తి చేయండి

గ్యాస్ సబ్సిడీ నగదు కట్

-ఉజ్వల్ యోజన పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లపై రూ.300 సబ్సిడీ పొందుతున్న లబ్దిదారులు ఖచ్చితంగా ప్రతీ ఆర్ధిక సంవత్సరం ఈకేవైసీ చేయించుకోవాలి. లేకపోతే బ్యాంక్ అకౌంట్లో సబ్సిడీ సొమ్ము పడవు -ఈకేవైసీ పూర్తి చేయకపోయినా ఏడవ రీఫిల్ వరకు సబ్సిడీ కొనసాగుతోంది. ఆ తర్వాత కేవైసీ చేయకపోతే నిధులు నిలిపివేస్తారు -ఈకేవైసీ చేసుకున్నాక సొమ్ము మళ్లీ జమ అవుతాయి -ఇప్పటికే ఈకేవైసీ చేసుకుని ఉంటే ఇప్పుడు మళ్లీ చేసుకోవాల్సిన పని లేదు -ఈ ఆర్ధిక సంవత్సరం పూర్తయ్యేలోపు ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి -ఉజ్వల్ లబ్దిదారులతో పాటు మిగతా గ్యాస్ వినియోగదారులందరూ ఈ ప్రక్రియ పూర్తి చేయాలి

Follow Us
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం చివరి అవకాశం.. లేకపోతే డబ్బులు కట్
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం చివరి అవకాశం.. లేకపోతే డబ్బులు కట్
వాస్తు: ఇంట్లో ఈ మొక్కలు పెంచండి.. ఆరోగ్యం, ఐశ్వర్యం మీ సొంతం..!
వాస్తు: ఇంట్లో ఈ మొక్కలు పెంచండి.. ఆరోగ్యం, ఐశ్వర్యం మీ సొంతం..!
ఇదెక్కడి బౌలింగ్ సామీ.. టీ20 వరల్డ్ కప్‌లో సరికొత్త మైలురాయి..
ఇదెక్కడి బౌలింగ్ సామీ.. టీ20 వరల్డ్ కప్‌లో సరికొత్త మైలురాయి..
రక్షణ నుంచి అంతరిక్షం వరకు.. మన బంధం చెక్కుచెదరనిది.. మోదీ
రక్షణ నుంచి అంతరిక్షం వరకు.. మన బంధం చెక్కుచెదరనిది.. మోదీ
కాసేపయ్యాక వేళ్దాంలే అని మూత్రం ఆపుకుంటున్నారా? ఈ వార్నింగ్ మీకే!
కాసేపయ్యాక వేళ్దాంలే అని మూత్రం ఆపుకుంటున్నారా? ఈ వార్నింగ్ మీకే!
నీళ్లు పడుతుండగా మూలన అదేపనిగా చప్పుళ్లు..
నీళ్లు పడుతుండగా మూలన అదేపనిగా చప్పుళ్లు..
బాత్రూమ్‌లో స్మార్ట్‌ఫోన్ అలవాటు ఉందా? ఈ ఆరోగ్య సమస్యలు మీవెంటే!
బాత్రూమ్‌లో స్మార్ట్‌ఫోన్ అలవాటు ఉందా? ఈ ఆరోగ్య సమస్యలు మీవెంటే!
మొన్నటివరకు టాలీవుడ్ హీరోయిన్.. ఇప్పుడు UK కంపెనీ డైరెక్టర్
మొన్నటివరకు టాలీవుడ్ హీరోయిన్.. ఇప్పుడు UK కంపెనీ డైరెక్టర్
విరోషి పెళ్లి వేడుకలో టాప్‌ 9 విశేషాలు..
విరోషి పెళ్లి వేడుకలో టాప్‌ 9 విశేషాలు..
జింబాబ్వేతో కీలక పోరుకు భారత్ రెడీ.. ఓడితే టోర్నీ నుంచి ఔట్
జింబాబ్వేతో కీలక పోరుకు భారత్ రెడీ.. ఓడితే టోర్నీ నుంచి ఔట్