AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా కట్‌.. ఎప్పటి వరకంటే?

హైదరాబాద్‌ నగరవాసులకు జలమండలి కీలక సూచనలు జారీ చేసింది. నగరానికి నీటి పరఫరా చేసే కాండ్యూట్ లీకేజీల కారణంగా కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి అంతరాయం ఏర్పడే ప్రాంతాల్లోని వినియోగదారులు ముందస్తుగా అవసరమైన నీటిని నిల్వ చేసుకుని, పొదుపుగా వినియోగించాలని జలమండలి విజ్ఞప్తి చేసింది.

Anand T
|

Updated on: Nov 03, 2026 | 8:35 AM

Share
హైదరాబాద్ నగరానికి కృష్ణా, గోదావరి, సింగూరు–మంజీరా, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ తదితర జలవనరుల నుంచి జలమండలి ప్రతిరోజూ దాదాపు 560 మిలియన్ గ్యాలన్ల (ఎంజీడీ) తాగునీటిని సరఫరా చేస్తోంది. ఇందులో గండిపేట (ఉస్మాన్‌సాగర్) నుంచి నగరానికి నీటిని సరఫరా చేసే 20 ఎంజీడీల సామర్థ్యం గల వందేళ్లకు పైగా పురాతనమైన రాతి నిర్మాణ కాండ్యూట్ (Conduit)పై సబ్జా కాలనీ, టోలిచౌకి, మణికొండ ప్రాంతాల వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. వీటిని అరికట్టేందుకు జలమండలి మరమ్మతు పనులు చేపట్టనుంది.

1 / 6
ఈ కాండ్యూట్ వందేళ్లకు పైగా పురాతనమైనది కావడంతో లీకేజీలను పూర్తిస్థాయిలో అరికట్టి, నీటి సరఫరా వ్యవస్థను సక్రమంగా నిర్వహించేందుకు మరమ్మతులు చేపడుతున్నారు. ఈ పనులను నవంబర్ 3వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 4వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు నిర్వహించనున్నారు.

2 / 6
ఈ పాక్షిక అంతరాయం కేవలం గండిపేట నుంచి నీటిని సరఫరా చేసే 20 ఎంజీడీల కాండ్యూట్‌కు మాత్రమే పరిమితం. నగరానికి వివిధ జలవనరుల నుంచి సరఫరా చేస్తున్న మొత్తం 560 ఎంజీడీల నీటిలో ఈ కాండ్యూట్‌పై ఆధారపడిన ప్రాంతాల్లో మాత్రమే అంతరాయం ఏర్పడనుంది. సింగూరు–మంజీరా, కృష్ణా, గోదావరి తదితర ఇతర జలవనరుల నుంచి తాగునీటి సరఫరా యథావిధిగా కొనసాగుతుంది.

3 / 6
గోషామహల్, కార్వాన్ సర్కిళ్లు (డివిజన్-13): గోషామహల్, కార్వాన్ పరిధిలోని రెడ్‌హిల్స్, నాంపల్లి, మల్లేపల్లి, సీతారాంబాగ్, గోడేకీ ఖబర్, హిందీనగర్, అసెంబ్లీ, సెక్రటేరియట్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఆదర్శ్‌నగర్, నాంపల్లి సౌత్ సెంట్రల్ రైల్వే ప్రాంతం, గన్‌ఫౌండ్రీ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది,

4 / 6
గోల్కొండ జోన్ (డివిజన్-14): ఇక గోల్కొండ జోన్ పరిధిలోని చింతల్ బస్తీ, విజయనగర్ కాలనీ, ఓల్డ్ మల్లేపల్లి, ఆసిఫ్‌నగర్, అహ్మద్‌నగర్ ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనుంది. అలాగే కవాడిగూడ పరిధిలోని గాంధీనగర్ వార్డుల పరిధిలోని దోమలగూడ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఇక జూబ్లీహిల్స్ పరిధిలోని బంజారాహిల్స్, ఇతర ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం 

5 / 6
గండిపేట కాండ్యూట్‌పై చేపట్టనున్న మరమ్మతుల కారణంగా పైన పేర్కొన్న ప్రాంతాల్లో మాత్రమే తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. నగరవ్యాప్తంగా తాగునీటి సరఫరా యథావిధిగా కొనసాగుతుందని జలమండలి స్పష్టం చేసింది.అంతరాయం ఏర్పడే ప్రాంతాల్లోని వినియోగదారులు ముందస్తుగా అవసరమైన నీటిని నిల్వ చేసుకుని, పొదుపుగా వినియోగించాలని జలమండలి విజ్ఞప్తి చేసింది.

6 / 6
Follow Us