IND vs ZIM T20 WC Highlights: భారత్ ఘన విజయం..
India vs Zimbabwe, T20 world Cup 2026 Highlights: 20 ఓవర్లలో భారత్ 4 వికెట్లకు 256 పరుగులు చేసింది. దీంతో జింబాబ్వే ముందు భారీ టార్గెట్ నిలిచింది. అభిషేక్, హార్దిక్ హాఫ్ సెంచరీలతో దుమ్మురేపారు. చివర్లో తిలక్ వర్మ ఊచకోతతో భారీ స్కోర్ నమోదైంది.

టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో భారత్ తొలి విజయాన్ని సాధించింది. గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో టీం ఇండియా జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో దక్షిణాఫ్రికా సూపర్ 8 గ్రూప్ 1 నుంచి సెమీఫైనల్‌కు చేరుకుంది.
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. టీం ఇండియా 20 ఓవర్లలో 4 వికెట్లకు 256 పరుగులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా, జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు మాత్రమే చేయగలిగింది.
రెండు జట్ల ప్లేయింగ్ 11..
భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
జింబాబ్వే (ప్లేయింగ్ XI): తడివానాషే మారుమణి(కీపర్), బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, ర్యాన్ బర్ల్, సికందర్ రజా(కెప్టెన్), టోనీ మునియోంగా, తషింగా ముసెకివా, బ్రాడ్ ఎవాన్స్, టినోటెండా మపోసా, బ్లెస్సింగ్ ముజారబానీ, రిచర్డ్ నగరవ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
LIVE Cricket Score & Updates
-
భారత్ ఘన విజయం
జింబాబ్వేపై 72 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ సెమీస్ ఆశలను నిలుపుకుంది.
-
14 ఓవర్లలో
జింబాబ్వే 14 ఓవర్లలో రెండు వికెట్లకు 105 పరుగులు చేసింది. బ్రియాన్ బెన్నెట్, కెప్టెన్ సికందర్ రజా క్రీజులో ఉన్నారు.
-
-
బ్రియాన్ బెన్నెట్ సిక్స్ టు ఫిఫ్టీ
జింబాబ్వే ఆటగాడు బ్రియాన్ బెన్నెట్ 13వ ఓవర్లో అర్ధ సెంచరీ సాధించాడు. జస్ప్రీత్ బుమ్రా ఇన్నింగ్స్ రెండో బంతికి సిక్స్ కొట్టి తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
-
8 ఓవర్లలో..
జింబాబ్వే 8 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. తడివానాషే మరుమాని (20 పరుగులు) అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చాడు.
-
వికెట్ల కోసం ఎదురుచూపులు..
జింబాబ్వే 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. బ్రియాన్ బెన్నెట్, తడివానాషే మరుమాని క్రీజులో ఉన్నారు.
-
-
3 ఓవర్లకు..
జింబాబ్వే 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. బ్రియాన్ బెన్నెట్, తడివానాషే మరుమాని క్రీజులో ఉన్నారు.
-
IND vs ZIM Score: జింబాబ్వే టార్గెట్ 257
19వ ఓవర్లో భారత జట్టు టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక స్కోరును నమోదు చేసింది. మునుపటి రికార్డు 2007లో ఇంగ్లాండ్‌పై నమోదైన 218 పరుగులే ఇప్పటి వరకు అగ్రస్థానంలో నిలిచింది. డర్బన్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో, యువరాజ్ సింగ్ స్టువర్ట్ బ్రాడ్ ఓవర్‌లో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టాడు. దీంతో భారత్ 20 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది.
-
India vs Zimbabwe, 48th Match, Super 8 Group 1: 16 ఓవర్లకు
భారత్ 16 ఓవర్లలో 4 వికెట్లకు 187 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ క్రీజులో ఉన్నారు.
-
అభిషేక్ ఔట్..
అభిషేక్ శర్మ 11వ ఓవర్ మొదటి బంతికే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20 ప్రపంచ కప్‌లో ఇది అతనికి తొలి అర్ధ సెంచరీ. ఆతర్వాత 55 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
-
అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ
భారత ఓపెనర్ అభిషేక్ శర్మ (50*) హాఫ్ సెంచరీ సాధించాడు. సికందర్ రజా వేసిన 10.1వ ఓవర్‌లో సింగిల్‌తో అభిషేక్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 26 బంతుల్లో అర్ధశతకం సాధించిన అభిషేక్.. అంతకుముందు 10వ ఓవర్‌లో బ్రియాన్ బెనెట్ 10 పరుగులు చేశాడు.
-
స్పిన్‌ను ఆచితూచి ఆడుతోన్న బ్యాటర్లు
స్పిన్నర్లను ఆచితూచి ఆడుతున్నారు ఇషాన్ కిషన్ (26*), అభిషేక్ శర్మ (41*). ప్రస్తుతం ఇద్దరూ హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం భారత్ స్కోరు 9 ఓవర్లకు 99/1గా ఉంది.
-
పవర్ ప్లేలో టీమిండియా స్కోర్..
టీమిండియా బౌండరీలతో విరుచుకుపడుతోంది. ప్రస్తుతం ఆరు ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టపోయి 80 పరుగులు చేసింది టీమిండియా. ప్రస్తుతం ఇషాన్ కిషన్(15), అభిషేక్ శర్మ(33) క్రీజులో ఉన్నారు.
-
India vs Zimbabwe: నిరాశ పరిచిన శాంసన్..
సంజూ శాంసన్ (24 పరుగులు, 2 సిక్స్‌లు, 1 ఫోర్) మరోసారి నిరాశపరిచాడు. లక్కీ ఛాన్స్ దొరికితే పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాాడు. దీంతో భారత జట్టు 3.4 ఓవర్లలో 48 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది.
-
India vs Zimbabwe, 48th Match: 3 ఓవర్లకు
3 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 46 పరుగులు చేసింది. శాంసన్ 23, అభిషేక్ 16 పరుగులతో నిలిచారు.
-
IND vs ZIM Lie Score: తొలి ఓవర్లో 13 పరుగులు
తొలి ఓవర్ ముగిసే సరికి భారత జట్టు 13 పరుగులు చేసింది. శాంసన్ 9, అభిషేక్ 0 పరుగులతో నిలిచారు.
-
Team India: ఓపెనర్లుగా అభిషేక్, శాంసన్
టాస్ ఓడి బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత జట్టు తరపున అభిషేక్ శర్మ, శాంసన్ లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు.
-
IND vs ZIM Playing 11: టీమిండియాలో రెండు మార్పులు
గత మ్యాచ్ నుంచి ప్లేయింగ్ XIలో టీమిండియా 2 మార్పులు చేసింది. అక్షర్ పటేల్, సంజు శాంసన్ తిరిగి వస్తున్నారు. రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్ లను బెంచ్ లోనే ఉంచారు.
-
ఇరుజట్ల ప్లేయింగ్ 11
భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
జింబాబ్వే (ప్లేయింగ్ XI): తడివానాషే మారుమణి(కీపర్), బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, ర్యాన్ బర్ల్, సికందర్ రజా(కెప్టెన్), టోనీ మునియోంగా, తషింగా ముసెకివా, బ్రాడ్ ఎవాన్స్, టినోటెండా మపోసా, బ్లెస్సింగ్ ముజారబానీ, రిచర్డ్ నగరవ.
-
IND vs ZIM: టాస్ గెలిచిన జింబాబ్వే..
టాస్ గెలిచిన జింబాబ్వే ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు బ్యాటింగ్ చేయనుంది.
-
IND vs ZIM: టీమిండియాకు ఊరట..
సౌతాఫ్రికా జట్టు నుంచి టీమిండియాకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. వెస్టిండీస్ జట్టును 9 వికెట్ల తేడాతో ఓడించిన సౌతాఫ్రికా.. భారత జట్టుకు సెమీస్ ఆశలకు ఊపిరిపోసింది.
-
IND vs ZIM Live Score: ఆధిపత్యం ఎవరిదంటే?
భారత్, జింబాబ్వే ఇప్పటివరకు 13 టీ20 మ్యాచ్‌లు ఆడగా, టీం ఇండియా 10 మ్యాచ్‌లు గెలిచింది. జింబాబ్వే కేవలం మూడు మ్యాచ్‌లలో మాత్రమే గెలిచింది. ఈ రెండు జట్లు గతంలో 2022లో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో తలపడ్డాయి. సూర్యకుమార్ యాదవ్ అజేయంగా అర్ధ సెంచరీతో భారత్ విజయం సాధించింది.
-
IND vs ZIM Score: ఒక్క టీ20 ఆడలే..
జింబాబ్వే జట్టు భారతదేశంలో భారత్‌తో ఇప్పటివరకు ఒక్క టీ20 అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ, భారతదేశంలో 24 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. వాటిలో 19 వన్డేలు, ఐదు టెస్టులు ఉన్నాయి.
Published On - Feb 26,2026 5:20 PM
