భారీగా పెరిగిన ఐపీఎల్ మీడియా రైట్స్.. ఒక్కో మ్యాచ్ విలువ తెలిస్తే షాకే.. ప్రపంచంలోనే రెండో ఖరీదైన క్రీడగా మారే ఛాన్స్?

IPL Media Rights: ప్రస్తుతం, అమెరికాలోని NFL అత్యంత ఖరీదైన క్రీడా ఆస్తిగా పరిగణిస్తున్నారు. NFLలో ఒక్కో మ్యాచ్ విలువకు రూ. 134 కోట్లుగా ఉంది. అదే సమయంలో ప్రీమియర్ లీగ్‌లో ఒక్కో మ్యాచ్ విలువ రూ.81 కోట్లుగా ఉంది.

భారీగా పెరిగిన ఐపీఎల్ మీడియా రైట్స్.. ఒక్కో మ్యాచ్ విలువ తెలిస్తే షాకే.. ప్రపంచంలోనే రెండో ఖరీదైన క్రీడగా మారే ఛాన్స్?
Ipl Media Rights Tender Auction
Follow us
Venkata Chari

|

Updated on: Jun 07, 2022 | 1:08 PM

IPL Media Rights Tender: 2023-28 కాలానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రసార హక్కులు మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగుతుందని, దీంతో ప్రస్తుతం అంచనా వేసిన రూ. 50,000 కోట్ల నుంచి రూ. 60,000 కోట్లకు చేరుకోవచ్చని బ్రోకరేజ్ సంస్థ ఎలారా సెక్యూరిటీస్ పేర్కొంది. ఈమేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. దేశంలో క్రికెట్‌పై ఉన్న ఆసక్తిని ఇది తెలియజేస్తుందని ఆ సంస్థ పేర్కొంది. కాగా, ఈ ఏడాది 8 జట్ల నుంచి 10కి చేరింది. దీంతో వచ్చే ఏడాది ఐపీఎల్ ప్రసార హక్కులకు భారీ డిమాండ్ ఉంటుందని, ఇందులో బిడ్ చేసి కీలక సంస్థలు కూడా ఈ హక్కుల కోసం తీవ్రంగా పోటీపడుతుండడంతో భారీ ధర బీసీసీఐ ఖజానాకు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఐపీఎల్ లీగ్‌తో బీసీసీఐ భారీ రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. పరిశ్రమ అంచనాల ప్రకారం, 2023 నుంచి 2022 ఏడాది వరకు నిర్వహించే IPL మీడియా హక్కుల ఇ-వేలం తర్వాత ఒక్కో మ్యాచ్ విలువ రూ. 100 కోట్లు దాటుతుందని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఐపీఎల్ ప్రపంచంలోనే రెండో అత్యంత ఖరీదైన క్రీడగా మారుతుంది. IPL ప్రీమియర్ లీగ్, మేజర్ లీగ్ బేస్‌బాల్‌లను ఒక్కో మ్యాచ్ విలువలోనూ అధిగమించనుంది. చివరిసారిగా 2018 నుంచి 2022 వరకు మీడియా హక్కులను రూ.16,348 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

2023 నుంచి 2027 వరకు మీడియా హక్కులు..

ఇవి కూడా చదవండి

2023 నుంచి 2027 వరకు మీడియా హక్కుల కోసం, బోర్డు రూ. 32,890 కోట్ల బేస్ ధరను నిర్ణయించింది. టీవీ హక్కుల బేస్ ధర ఒక్కో మ్యాచ్‌కి రూ. 49 కోట్లు కాగా, డిజిటల్ రైట్స్ ఒక్కో మ్యాచ్‌కి రూ.33 కోట్లుగా ప్రకటించింది. స్పోర్ట్స్ మీడియా హక్కుల నిపుణుల మేరకు, “ఒక మ్యాచ్‌కి టీవీ హక్కులు 20-25% పెరుగుతాయని అంచనా వేయలేదు, అయితే డిజిటల్ హక్కుల ప్యాకేజీ పెరగవచ్చు” అని అంటున్నారు. అంచనాల ప్రకారం, మొత్తం మీద, ఒక మ్యాచ్ విలువ రూ. 115-120 కోట్లకు చేరుకుంటుందని అంటున్నారు. ప్రస్తుతం, అమెరికాలోని NFL అత్యంత ఖరీదైన క్రీడా ఆస్తిగా పరిగణిస్తున్నారు. NFLలో ఒక్కో మ్యాచ్ విలువకు రూ. 134 కోట్లుగా ఉంది. అదే సమయంలో ప్రీమియర్ లీగ్‌లో ఒక్కో మ్యాచ్ విలువ రూ.81 కోట్లుగా ఉంది.

రెండు రోజుల పాటు వేలం..

మొదటి, రెండవ గ్రూపుల వేలం ఒక రోజు నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. అదే సమయంలో, మూడవ, నాల్గవ గ్రూపులు మరుసటి రోజు వేలం వేయనున్నారు. ఈ-వేలం ద్వారా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. మొదటి గ్రూప్‌లో గెలుపొందిన కంపెనీ రెండో గ్రూప్‌కి మళ్లీ వేలం వేయడానికి అనుమతించనున్నారు. అంటే, రెండో గ్రూప్‌ను వేరే కంపెనీ కొనుగోలు చేస్తే, మొదటి గ్రూప్‌ను కొనుగోలు చేసిన కంపెనీ అంతకంటే ఎక్కువ చెల్లించి దాన్ని పొందవచ్చు. అదేవిధంగా, రెండవ గ్రూపులో విజేతగా నిలిచిన కంపెనీ మూడవ గ్రూపు కోసం మళ్లీ వేలం వేయడానికి అనుమతించనున్నారు.