Babar vs Kohli: వన్డేల్లో నయా కింగ్.. కోహ్లీ ‘స్పీడ్’కు బ్రేకులు వేసిన పాక్ కెప్టెన్.. ఆ స్పెషల్ రికార్డ్ ఏంటంటే?

వెస్టిండీస్‌పై బాబర్ ఆజం తన సెంచరీతో విరాట్ కోహ్లీ పేరిట ఉన్న భారీ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డేల్లో కెప్టెన్‌గా అత్యంత వేగంగా..

Babar vs Kohli: వన్డేల్లో నయా కింగ్.. కోహ్లీ 'స్పీడ్'కు బ్రేకులు వేసిన పాక్ కెప్టెన్.. ఆ స్పెషల్ రికార్డ్ ఏంటంటే?
Babar Vs Virat
Follow us

|

Updated on: Jun 09, 2022 | 10:22 AM

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్(Babar Azam) తన అద్భుత బ్యాటింగ్‌తో ప్రతి ఇన్నింగ్స్‌లోనూ భారీ రికార్డులను కొల్లగొడుతుంటాడు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లోనూ ఓ స్పెషల్ రికార్డు నెలకొల్పి, తన సత్తా చాటాడు. ఈ క్రమంలో వెస్టిండీస్‌పై బాబర్ అజామ్ తన వన్డే కెరీర్‌లో 17వ సెంచరీని నమోదు చేశాడు. ఈ సెంచరీతో పాక్ జట్టుకు విజయాన్ని అందించడమే కాకుండా, భారత రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లీ రికార్డును కూడా నాశనం చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఈమ్యాచ్‌లో బాబర్ ఆజం 107 బంతుల్లో 103 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు బాదేశాడు. అలాగే, ఈ ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీల భాగస్వామ్యంలో కీలక పాత్ర పోషించాడు. బాబర్ అజామ్ రెండో వికెట్‌కు ఇమామ్-ఉల్-హక్‌తో కలిసి 103 పరుగుల భాగస్వామ్యం అందించగా, కీపర్ కం బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్‌తో కలిసి మూడో వికెట్‌కు 100 బంతుల్లో 108 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ఈ భారీ భాగస్వామ్యాలతో పాకిస్తాన్ జట్టు 306 పరుగులను ఛేదించి, ఘన విజయం సాధించింది.

విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన బాబర్..

ఇవి కూడా చదవండి

వెస్టిండీస్‌పై బాబర్ ఆజం తన సెంచరీతో విరాట్ కోహ్లీ పేరిట ఉన్న భారీ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డేల్లో కెప్టెన్‌గా అత్యంత వేగంగా 1000 పరుగులకు పూర్తి చేసిన రికార్డుల్లో అగ్రస్థానానికి చేరాడు. ఈ లిస్టులో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. బాబర్ కేవలం 13వ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌గా ఈ ఘనత సాధించగా, విరాట్ కోహ్లీ 17 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేశాడు. ఆ తర్వాత ఏబీ డివిలియర్స్ (18 ఇన్నింగ్స్‌లు) మూడో స్థానంలో నిలిచాడు.

వన్డేల్లో అత్యంత వేగంగా 17 సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా బాబర్ ఆజం నిలిచాడు. వన్డే క్రికెట్‌లో హ్యాట్రిక్ సెంచరీలు పూర్తి చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. వరుసగా మూడో సెంచరీ నమోదు చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో సెంచరీ సాధించిన బాబర్.. అంతకుముందు ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు సాధించాడు. దీంతో వన్డే క్రికెట్‌లో వరుసగా రెండు పర్యాయాలు హ్యాట్రిక్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా బాబర్ ఆజం నిలిచాడు.

వన్డేల్లో వేగవంతంగా 1000 పరుగులు(కెప్టెన్‌గా) చేసిన ప్లేయర్లు:

బాబర్ అజం (పాకిస్తాన్)- 13 ఇన్నింగ్స్‌లు

విరాట్ కోహ్లీ (భారత్) – 17 ఇన్నింగ్స్‌లు

ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా) – 18 ఇన్నింగ్స్‌లు

కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) – 20 ఇన్నింగ్స్‌లు

అలిస్టర్ టోటల్ (ఇంగ్లండ్) – 21 ఇన్నింగ్స్‌లు

సౌరవ్ గంగూలీ (భారత్) – 22 ఇన్నింగ్స్‌లు