AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో అద్భుత క్యాచ్.. షాకవుతోన్న నెటిజన్లు..

Shadab Khan catch: వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డేలో షమ్రా బ్రూక్స్ షార్ట్ థర్డ్ మ్యాన్ వైపు కొట్టిన బంతిని పాకిస్థాన్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ అద్భుతంగా అందుకున్నాడు. దీంతో ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Watch Video: గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో అద్భుత క్యాచ్.. షాకవుతోన్న నెటిజన్లు..
Shadab Khan Unreal Catch
Venkata Chari
|

Updated on: Jun 09, 2022 | 11:07 AM

Share

నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు(Viral) సందడి చేస్తుంటాయి. వీటిలో కొన్ని నవ్విస్తే, మరికొన్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇక క్రికెట్(Cricket) విషయానకి వస్తే, ఈ వీడియోలు కూడా నెట్టింట్లో తెగ ఆకట్టుకుంటాయి. తాజాగా పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ టీంల మధ్య జరుగుతోన్న వన్డే మ్యాచ్‌లోనే ఓ అద్భుతమైన క్యాచ్ నెటిజన్లుకు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో క్యాచ్ అందుకోవడంతో, ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పాకిస్థాన్, వెస్టిండీస్(PAK vs WI) మధ్య బుధవారం ముల్తాన్ వేదికగా తొలి మ్యాచ్ జరిగింది. ముల్తాన్‌లో 14 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మూడో ఓవర్‌లో కైల్ మేయర్స్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను షాహీన్ అఫ్రిది అద్భుతంగా పట్టి వెస్టిండీస్‌కు తొలి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత షాయ్ హోప్, షమ్రా బ్రూక్స్ రెండో వికెట్‌కు 154 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 70 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బ్రూక్స్‌ను మహ్మద్ నవాజ్ విడగొట్టాడు. షార్ట్ థర్డ్ మ్యాన్ దిశగా వచ్చిన ఓ అద్భుతమైన క్యాచ్‌ అందుకుని షాదాబ్ ఖాన్‌ అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుం నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది.

నవాజ్ వేసిన బంతిని బ్రూక్స్ స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బ్యాట్స్‌మన్ టైమింగ్ సరిగా లేకపోవడంతో బంతి అతని బ్యాట్ బయటి అంచుకు తగిలి షార్ట్ థర్డ్ మ్యాన్ వైపు వెళ్లింది. పాయింట్‌లో ఉన్న షాదాబ్ ఖాన్ క్యాచ్ పట్టేందుకు బంతి వైపు పరుగులు తీశాడు. బంతి కిందకు పడిపోతుందేమో అనిపించినా.. షాదాబ్ ఎడమవైపు గాలిలో దూకి ఒంటి చేత్తో అపురూపమైన క్యాచ్ పట్టాడు. షాదాబ్ ఖాన్ క్యాచ్ వీడియోను పీసీబీ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టీం 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ టీం 8 వికెట్ల నష్టానికి 305 పరుగులు సాధిచింది. అనంతరం పాకిస్తాన్ టీం 49.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది.

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌