AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోలీతో ఈ రాశులకు అదృష్టం, ఆకస్మిక ధనలాభం..! మీకు ఏ రంగు బెస్ట్ అవుతుందో తెలుసా..?

Holi 2026 horoscope: జ్యోతిష్య ప్రకారం.. ఈసారి హోలీ రోజున కుంభరాశిలో నాలుగు గ్రహాలు సంయుక్తంగా ఉండటం వల్ల అనేక రాజయోగాలు ఒకేసారి ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా బుధాదిత్య రాజయోగం, మంగళాదిత్య రాజయోగం, చతుర్గ్రహి యోగం, అలాగే శుక్రుడు మీనరాశిలో ప్రవేశించడం వల్ల ఏర్పడే మాలవ్య రాజయోగం ప్రభావం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ యోగాలు కొన్ని రాశుల వారికి కొత్త విజయ దశను ప్రారంభించగలవు.

హోలీతో ఈ రాశులకు అదృష్టం, ఆకస్మిక ధనలాభం..! మీకు ఏ రంగు బెస్ట్ అవుతుందో తెలుసా..?
Holi 2026
Rajashekher G
|

Updated on: Feb 26, 2026 | 5:46 PM

Share

సనాతన ధర్మంలో ఉపవాసాలు, పండుగలు ఎంతో పవిత్రమైనవిగా భావించబడతాయి. ప్రతి పండుగకు సంబంధించిన తిథి, గ్రహస్థితి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. గ్రహాల అనుకూల స్థితి వల్ల శుభప్రదమైన రాజయోగాలు ఏర్పడి, 12 రాశులపై ప్రత్యేక ప్రభావం చూపుతాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఈ సంవత్సరం హోలీ మరింత విశిష్టమైనదిగా భావించబడుతోంది. మార్చి 3న ఫాల్గుణ పూర్ణిమ సందర్భంగా హోలికా దహన్ జరగనుంది. చాలా ప్రాంతాల్లో అదే రోజున కొన్ని ప్రాంతాల్లో మాత్రం మార్చి 4న రంగులతో హోలీ వేడుకలు జరుగుతాయి. జ్యోతిష్య ప్రకారం.. ఈసారి హోలీ రోజున కుంభరాశిలో నాలుగు గ్రహాలు సంయుక్తంగా ఉండటం వల్ల అనేక రాజయోగాలు ఒకేసారి ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా బుధాదిత్య రాజయోగం, మంగళాదిత్య రాజయోగం, చతుర్గ్రహి యోగం, అలాగే శుక్రుడు మీనరాశిలో ప్రవేశించడం వల్ల ఏర్పడే మాలవ్య రాజయోగం ప్రభావం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ యోగాలు కొన్ని రాశుల వారికి కొత్త విజయ దశను ప్రారంభించగలవు.

హోలీ రంగుల ఆధ్యాత్మిక ప్రాముఖ్యత

  • హోలీ అనేది కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు.. ఇది ప్రేమ, ఐక్యత, ఆనందానికి ప్రతీక.
  • ఎరుపు – ప్రేమ, శక్తి, ఉత్సాహానికి సూచిక. ఇది ప్రతికూల శక్తులను తొలగిస్తుందని నమ్మకం.
  • పసుపు – జ్ఞానం, ఆనందం, కాంతి, శ్రేయస్సుకు చిహ్నం. సూర్యునితో సంబంధం కలిగి ఉండటం వల్ల అత్యంత శుభప్రదం.
  • ఆకుపచ్చ – ప్రకృతి, సమతుల్యత, మానసిక శాంతి సూచిస్తుంది.
  • నీలం – స్థిరత్వం, భక్తి, విశ్వాసానికి చిహ్నం.
  • గులాబీ – ప్రేమ, ఆప్యాయత, అందానికి సూచిక.

మీరు కోరుకునే భావోద్వేగానికి అనుగుణంగా రంగులను ఎంచుకోవడం మంచిది. ఉత్సాహం కోసం ఎరుపు లేదా పసుపు, శాంతి కోసం ఆకుపచ్చ లేదా నీలం అనుకూలంగా ఉంటాయి.

ఈ రాజయోగాల వల్ల లాభపడే రాశులు

కుంభ రాశి

కుంభరాశిలో సూర్యుడు, బుధుడు కలిసి ఉండటం వల్ల బుధాదిత్య రాజయోగం, సూర్యుడు–కుజుడు సంయోగం వల్ల మంగళాదిత్య రాజయోగం, అలాగే నాలుగు గ్రహాల సమూహం వల్ల చతుర్గ్రహి యోగం ఏర్పడుతున్నాయి. శుక్రుడు మార్చి 2, 2026న మీనరాశిలోకి ప్రవేశించి మాలవ్య రాజయోగం సృష్టిస్తాడు. ఈ సమయం మార్చి 26, 2026 వరకు శుభప్రదంగా ఉంటుంది. కొత్త అవకాశాలు, ఆర్థిక పురోగతి, ప్రతిష్ట పెరుగుదల.

వృషభ రాశి

శుక్రుడు అధిపతి కావడంతో మాలవ్య రాజయోగం ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. సంపద వృద్ధి, వృత్తిలో పురోగతి, కుటుంబ సౌఖ్యం.

మిథున రాశి

బుధాదిత్య రాజయోగం మిథునరాశి వారికి ఎంతో అనుకూలం. తెలివితేటలు పెరుగుతాయి, కొత్త ఉద్యోగ అవకాశాలు, వ్యాపార లాభాలు.

సింహ రాశి

ఈ సమయంలో కీర్తి, నాయకత్వ గుణాలు మెరుగుపడవచ్చు. పదోన్నతి అవకాశాలు, సమాజంలో గౌరవం.

తుల రాశి

శుక్ర ప్రభావం వల్ల మంచి రోజులు ప్రారంభమవుతాయి. కోరికల సాధన, విజయ మార్గం స్పష్టత, సంబంధాల్లో ఆనందం.

ఈసారి హోలీ గ్రహస్థితుల దృష్ట్యా విశేష శుభప్రదమైనదిగా భావించబడుతోంది. అయితే జ్యోతిష్య ఫలితాలు వ్యక్తిగత జన్మకుండలిపై ఆధారపడి మారవచ్చు. హోలీ అసలు సందేశం ప్రేమ, ఐక్యత, ఆనందం. రంగులతో ఆనందాన్ని పంచుకుంటూ ఆరోగ్యం, శాంతి, శ్రేయస్సును ఆకర్షిద్దాం.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్