AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Murasu: మురసు తుఫాన్ అలర్ట్.. ఏపీలో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్‌.. ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక..

మురసు తుఫాన్ ప్రభావం ఏపీకి ఎక్కువ పడుతోంది. అర్నబ్ తుపాన్ బీభత్సం మరువకముందే ఇప్పుడు మురసు తుఫాన్ భయపెడుతోంది. ఈ తుఫాన్ ఇప్పటికే తీరం దాటడంతో ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి. దీంతో వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది,

Cyclone Murasu: మురసు తుఫాన్ అలర్ట్.. ఏపీలో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్‌.. ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక..
Cyclone Murasu
Venkatrao Lella
|

Updated on: Nov 03, 2026 | 1:22 PM

Share

ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో మురసు తీవ్ర తుపాను తీరం దాటే ప్రక్రియ కొనసాగుతోంది. క్రమంగా తుపాను తీవ్రత తగ్గే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. మురసు తుపాను ప్రభావంతో నేడు బాపట్ల, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. నవంబర్ 3న మధ్య ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముండగా.. నవంబర్ 4న మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు అలర్ట్ జారీ చేసింది. మురసు తుపాను ప్రభావంతో ఇప్పటివరకు బాపట్ల జిల్లాలో అత్యధికంగా 56.95 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. అధికారులు అలర్ట్..

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయి. తాజా నివేదిక ప్రకారం 10,805 మంది పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైద్య బృందాలు, 108, 102, 104 అంబులెన్సులు ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రసవానికి దగ్గరగా ఉన్న గర్భిణులను ముందస్తు జాగ్రత్తగా సమీప వైద్య కేంద్రాలకు తరలించారు. మురసు తుపాను ప్రభావంతో ప్రాథమిక అంచనాల ప్రకారం 30,661 హెక్టార్ల వరి, 21,474 హెక్టార్ల పత్తి, 605 హెక్టార్ల మొక్కజొన్న పంటలకు నష్టం జరిగే అవకాశముంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు విద్యుత్ శాఖ ప్రత్యేక బృందాల ఏర్పాటు చేశారు. సాగునీటి చెరువులు, రిజర్వాయర్లు, దిగువ ప్రాంతాల్లో వరద పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నారు. తెగిపడిన విద్యుత్ తీగలు, నేలకొరిగిన చెట్లు, నీటితో నిండిన రహదారులకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు.బలహీనమైన ఇళ్లు, పూరిళ్లు, రేకుల షెడ్లలో నివసించే వారు అధికారుల సూచనల మేరకు పునరావాస కేంద్రాలకు తరలించారు.

అండగా నిలిచిన కర్ణాటక ప్రభుత్వం

అటు మురసు తుఫాను సహాయక చర్యల్లో ఏపీకి కర్ణాటక ప్రభుత్వం అండగా నిలిచింది. దీంతో కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌కు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీకి సహాయం అందించేందుకు ప్రత్యేక బృందాలను కర్ణాటక ప్రభుత్వం పంపింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, పునరుద్ధరణ పనులకు కర్ణాటక బృందాల సహకారం అందించనున్నాయి. కష్టకాలంలో ఏపీకి అండగా నిలిచిన కర్ణాటక ప్రజల సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని చంద్రబాబు తెలిపారు. కర్ణాటక ప్రభుత్వానికి, ప్రజలకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

Follow Us