AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న విశాఖ యువకులు!.. కాపాడాలని ప్రభుత్వానికి వేడుకోలు..

ఉపాధి కోసం రష్యా వెళ్లిన ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఐదుగురు యువకులు అక్కడ చిక్కుకుపోయారు. ఫ్రూట్స్ ప్యాకేజింగ్ ఉద్యోగాలు ఉన్నాయని ఏజెంట్ గంగరాజు వారిని రష్యాకు పంపించగా.. అక్కడ బలవంతంగా రష్యా సైన్యంలో చేర్చి ఉక్రెయిన్ యుద్ధానికి పంపిస్తున్నారని వంశీ అనే యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న విశాఖ యువకులు!.. కాపాడాలని ప్రభుత్వానికి వేడుకోలు..
Vamsi With Other Andhra Man
Ram Naramaneni
|

Updated on: Nov 03, 2026 | 1:18 PM

Share

ఉపాధి కోసం రష్యా వెళ్లిన విశాఖపట్నం ప్రాంతానికి చెందిన యువకులు అక్కడ చిక్కుకుపోయారు. ఫ్రూట్స్ ప్యాకేజింగ్ పనులు ఉన్నాయని ఓ ఏజెంట్ నమ్మించి ఐదుగురు యువకులను రష్యాకు పంపించగా.. అక్కడికి వెళ్లిన తర్వాత వారికి చెప్పిన పని దొరకలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న యువకులకు నేపాల్‌కు చెందిన ఓ వ్యక్తి సూచనతో రష్యా సైన్యంలో ఉద్యోగం చేసే అవకాశం లభించింది. అయితే ఆర్మీలో చేరిన తర్వాత తమను బలవంతంగా ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలోకి పంపిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తల్లికి చివరి వీడియో మెసేజ్.. కాపాడాలంటూ వేడుకోలు

విశాఖకు చెందిన వంశీ తన తల్లికి పంపిన వీడియో సందేశం ఇప్పుడు కుటుంబంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తన సహచరుడు సతీష్‌తో కలిసి ఇటీవల వీడియో కాల్ ద్వారా తల్లితో మాట్లాడిన వంశీ.. ఇదే తన చివరి వీడియో కావచ్చని, ఇక ఇండియాకు తిరిగి రాలేనేమోనని కన్నీటిపర్యంతమైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమను బలవంతంగా రష్యా సైన్యంలో చేర్చి.. ఉక్రెయిన్‌తో యుద్ధానికి పంపేందుకు ఒత్తిడి చేస్తున్నారని వీడియోలో వెల్లడించినట్లు తెలిపారు.

ఐదుగురిని పంపిన ఏజెంట్.. ప్రస్తుతం ఇద్దరే మిగిలారని వంశీ ఆవేదన

ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మొత్తం ఐదుగురు యువకులు ఉపాధి కోసం రష్యా వెళ్లారు. జులై చివరి వారంలో వంశీ కూడా రష్యా వెళ్లినట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఫ్రూట్స్ ప్యాకేజింగ్ ఉద్యోగాలు ఉన్నాయని గంగరాజు అనే ఏజెంట్ వారిని విదేశాలకు పంపించినట్లు పేర్కొన్నారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత ఉద్యోగాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో రష్యా ఆర్మీలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. తమతో పాటు వెళ్లిన ఐదుగురిలో ప్రస్తుతం ఇద్దరే మిగిలారని వంశీ వీడియోలో చెప్పినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

కమ్యూనికేషన్ లేక ఆందోళనలో తల్లిదండ్రులు

వంశీ చివరి వీడియో సందేశం పంపినప్పటి నుంచి అతడిని సంప్రదించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. కానీ సరైన కమ్యూనికేషన్ లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గాజువాక మండలం దువ్వాడలోని జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో నివసిస్తున్న వంశీ తల్లిదండ్రులు తమ కుమారుడి పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సీఎం, డిప్యూటీ సీఎంకు తల్లి విజ్ఞప్తి

తన కుమారుడిని ఎలాగైనా సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని వంశీ తల్లి అప్పలకొండ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్పందించి తమ కుమారుడిని రష్యా నుంచి సురక్షితంగా భారతదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన తమ పిల్లలు యుద్ధంలో చిక్కుకునే పరిస్థితి రావడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి.

Follow Us