SRH: వరుసగా 4 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు.. కావ్యమారన్ ఖతర్నాక్ ప్లేయర్ సంచలనం..!
Salil Arora: రంజీ ట్రోఫీ 2026-27లో పంజాబ్ బ్యాటర్ సలీల్ అరోరా సంచలనం సృష్టిస్తున్నాడు. ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరఫున ఆడిన ఈ 23 ఏళ్ల యువ బ్యాటర్, ఆడిన నాలుగు రంజీ మ్యాచ్‌ల్లోనూ వరుసగా సెంచరీలు బాదాడు. తాజాగా ఆంధ్రపై మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 111 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

Salil Arora: రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌లో పలువురు భారత ఆటగాళ్లు బ్యాట్, బంతితో ఆకట్టుకుంటున్నారు. వీరిలో ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన సలీల్ అరోరా (Salil Arora) పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ సీజన్‌లో పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు, తాను ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ శతకాలు సాధించాడు.
నాలుగు మ్యాచ్‌లు.. నాలుగు సెంచరీలు..
అస్సాంపై: సీజన్‌లో తొలి సెంచరీ. 110 పరుగులు చేశాడు.
ఛత్తీస్‌గఢ్‌పై: 107 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
హైదరాబాద్‌పై: 151 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్. ఇది అతడి ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో అత్యధిక స్కోరు.
ఆంధ్రపై: వరుసగా నాలుగో సెంచరీ. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 186 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 111 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.
ఫస్ట్ క్లాస్ కెరీర్ గణాంకాలు..
2024లో దేశవాళీ క్రికెట్‌లో అడుగుపెట్టిన సలీల్ ఇప్పటివరకు 12 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 55.73 సగటుతో 836 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
ఐపీఎల్‌లో ఏం చేశాడు?
ఐపీఎల్ మినీ వేలంలో కావ్య మారన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ సలీల్‌ను రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2026లో అతడు 14 మ్యాచ్‌లు (11 ఇన్నింగ్స్) ఆడి 156 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఐపీఎల్‌లో పెద్దగా రాణించకపోయినా, రంజీలో ఇప్పుడు తన సత్తా చూపిస్తున్నాడు.
ఎక్కువమంది చదివినది: W,W,W,W,W,W,W,W,W.. ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లతో చెలరేగిన టీమిండియా ప్లేయర్..!
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




