IPL Retention: రూ.14.2 కోట్ల ప్లేయర్‌కు సీఎస్కే గుడ్‌బై.. మినీ వేలానికి ముందే భారీ స్కెచ్..!
IPL 2027 CSK Retention: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. గత వేలంలో రూ.14.2 కోట్లు పెట్టి కొన్న యువ ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్‌ను విడుదల చేయాలని ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు సమాచారం. అదే ధరకు కొన్న కార్తీక్ శర్మను మాత్రం రిటైన్ చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

IPL 2027 CSK Retention: ఐపీఎల్ 2027 మినీ వేలం డిసెంబర్ 16న గోవాలో జరగనుంది. ఈ వేలానికి ముందు పది ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను ప్రకటించాల్సి ఉంది. ఐదుసార్లు ఛాంపియన్ అయిన సీఎస్కే ఇప్పటికే ప్రణాళికలు మొదలుపెట్టిందని, పర్స్ విలువ పెంచుకోవడానికి ప్రశాంత్ వీర్ (Prashant Veer)ను వదులుకోవాలని చూస్తోందని నివేదికలు చెబుతున్నాయి. ఐపీఎల్ 2026 వేలంలో సీఎస్కే ఏకంగా రూ.14.2 కోట్లు ఖర్చు చేసి వీర్‌ను దక్కించుకుంది. కానీ ఆ ధరకు తగ్గ ప్రదర్శన ఇవ్వడంలో అతడు విఫలమయ్యాడు. ఆరు మ్యాచ్‌ల్లో కేవలం 90 పరుగులు చేసిన వీర్, బౌలింగ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
వీర్‌కు వేటు.. కార్తీక్‌కు అభయం..?
సీఎస్కే వేలంలో ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ (Kartik Sharma) ఇద్దరినీ ఒకే ధరకు (రూ.14.2 కోట్లు) కొనుగోలు చేసింది. క్రిక్‌బజ్ (Cricbuzz) నివేదిక ప్రకారం వీర్‌ను విడుదల చేసి, కార్తీక్‌ను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. వీర్ విషయంలో “వాల్యూ ఫర్ మనీ” కాలేదని ఫ్రాంచైజీ భావిస్తోందట. కానీ కార్తీక్ విషయంలో అలాంటి అభిప్రాయం లేదని సమాచారం.
రాజస్థాన్‌కు చెందిన 20 ఏళ్ల ఈ యువ బ్యాటర్ గత సీజన్‌లో 11 మ్యాచ్‌ల్లో 295 పరుగులు చేశాడు. వీర్‌తో పోలిస్తే అతడి సీజన్ చాలా మెరుగ్గా సాగింది. అయితే రిటెన్షన్లు, రిలీజ్‌లపై ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయాలనే లక్ష్యంతో సీఎస్కే ఉందని ఆ నివేదిక పేర్కొంది.
వీర్‌ను వదిలేస్తే పర్స్‌లో భారీ జంప్..
ప్రస్తుతం సీఎస్కే పర్స్‌లో రూ.2.4 కోట్లు ఉన్నాయి. దీనికి వార్షిక సాలరీ క్యాప్ పెంపు కింద మరో రూ.5 కోట్లు కలిస్తే, వేలానికి వారి బడ్జెట్ రూ.7.4 కోట్లు అవుతుంది. అయితే రూ.14.2 కోట్ల ధర పలికిన వీర్‌ను విడుదల చేస్తే, ఈ మొత్తం ఏకంగా రూ.21.6 కోట్లకు చేరుతుంది. ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు జట్టులోని లోపాలను సరిదిద్దుకోవాలని మేనేజ్‌మెంట్ చూస్తున్న నేపథ్యంలో, ఈ నిధులు చెన్నైకి భారీగా ఉపయోగపడతాయి.
ఎక్కువమంది చదివినది: 16 ఓవర్లు.. 180 పరుగులు.. టీ20 చరిత్రలోనే చెత్త రికార్డులో టీమిండియా తోపు..!
సీఎస్కేకి కావాల్సింది ఏంటి?
ప్రస్తుతం ఎల్లో ఆర్మీకి ఓ నమ్మకమైన ఫినిషర్ అవసరం. దీర్ఘకాలంలో ఎంఎస్ ధోనీ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడి కోసం వారు వెతుకుతున్నారు. దీనికి తోడు మిడిలార్డర్‌లో విధ్వంసకర బ్యాటర్ కూడా కావాలి. ఇక బౌలింగ్ విభాగంలోనూ జట్టుకు డెప్త్ లేదు. అందుకే వేలం బడ్జెట్‌ను పెంచుకోవాలని సీఎస్కే ప్లాన్ చేస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
