TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు భారీ శుభవార్త.. టికెట్ల ఛార్జీలు భారీగా తగ్గింపు.. ఒకేసారి ఎంతంటే..?
ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభవార్త అందించింది. టికెట్ల ఛార్జీలను భారీగా తగ్గించింది. ఏసీ బస్సుల్లో ఒకేసారి ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గించిన ఛార్జీలు మార్చి 21వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఏసీ బస్సులకు మాత్రమే ఈ తగ్గింపు వర్తించనుంది.

వేసవికాలంలో ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీ బస్సుల్లో టికెట్ల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మార్చి 1వ తేదీ నుంచి తగ్గించిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే సమ్మర్ మొదలుకావడంతో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉక్కబోత కూడా మొదలుకాబోతుంది. దీని వీటి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చేందుకు హైదరాబాద్‌లో తిరిగే ఏసీ బస్సుల్లో టికెట్ల రేట్లను తగ్గించారు. దీంతో ప్రజలపై భారం తగ్గడంతో పాటు ఎండాకాలంలో హాయిగా ఏసీ బస్సు ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. ఏయే బస్సుల్లో ఎంత తగ్గించారు.. తగ్గించిన తర్వాత ఛార్జీలు ఎలా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకుందాం.
కొత్త టికెట్ ఛార్జీలు ఇవే..
గతంలో మెట్రో డీలక్స్ ఏసీ బస్సుల్లో ప్రతీ నాలుగు కిలోమీటర్లకు టికెట్ ఛార్జీ రూ.30గా ఉండేది. కానీ ఇప్పుడు రూ.25కి తగ్గింది. దీంతో ప్రతీ నాలుగు కిలోమీటర్ల ప్రయాణంపై రూ.5 మేర తగ్గింపు మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుందని టీజీఎస్‌ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ-మెట్రో ఏసీ బస్సుల్లో గతంలో నాలుగు కిలోమీటర్లకు రూ.35 చొప్పున ఉండగా.. ఇప్పుడు రూ.25కి తగ్గనుంది. ఏకంగా రూ.10 మేర తగ్గనుండటం ప్రయాణికులకు ఊరటగా చెప్పవచ్చు. ఎండాకాలంతో పాటు ఏసీ బస్సుల్లో ఆక్సుపెన్సీ నిండుగా ఉండటం లేదు. ప్రస్తుతం 60 శాతం మాత్రమే ఆక్సుపెన్సీ ఉంటుంది. ధరలు ఎక్కువగా ఉంటాయనే కారణంతో కొంతమంది వెనకడుగు వేస్తున్నారు. ఛార్జీలను తగ్గిండచడం వల్ల ఆక్సుపెన్సీ పెరగడంతో పాటు సమ్మర్‌లో ప్రయాణికులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో టీజీఎస్‌ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఎంత దూరానికి ఎంత ఆదా..
1 నుంచి 3 కిలోమీటర్ల దూరానికి మెట్రో డీలర్స్ బస్సుల్లో 0 నుంచి రూ.10 వరకు ఆదా కానుండగా.. ఈ-మెట్రో బస్సుల్లో 5 నుంచి రూ.10 తగ్గుతుంది. ఇక 4-15 కిలోమీటర్ల దూరానికి మెట్రో డీలక్స్‌లలో రూ.5 నుంచి రూ.10, ఈ-మెట్రో బస్సుల్లో రూ.10 నుంచి రూ.15 ఆదా అవుతుంది. ఇక 16 నుంచి 21 కిలోమీటర్ల దూరానికి మెట్రో డీలక్స్‌లలో రూ.10 నుంచి రూ.15, ఈ-మెట్రో బస్సులలో రూ.10 నుంచి రూ.15, 22-30 కిలోమీటర్ల ప్రయాణానికి మెట్రో డీలక్స్,ఈ మెట్రో ఏసీ బస్సుల్లో రూ.5 నుంచి రూ.10 వరకు ఆదా అవుతుంది. కాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 275 మెట్రో డీలక్స్, 90 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు తిరుగుతున్నాయి. వీటిల్లో ఛార్జీల తగ్గింపుతో నగర ప్రజలకు లబ్ది చేకూరనుంది.
