పల్నాడు జిల్లా మాచర్లలో నవవధువు చౌడేశ్వరి మృతి కేసులో పరువు హత్య కోణం వెలుగుచూసింది. జమ్మలమడకకు చెందిన నాగరాజును ప్రేమ వివాహం చేసుకున్నందుకు తండ్రి చంద్రశీను కూతురిని ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మొదట ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా, పోస్ట్మార్టం నివేదికతో అసలు విషయం బయటపడింది.