AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఎగిరి గంతేసేవార్త.. నేరుగా అకౌంట్లోకి రూ.3 లక్షలు.. ప్రతీఒక్కరికీ అవకాశం

నిరుద్యోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. రూ.3 లక్షల వరకు ఆర్ధిక సాయం అందిస్తోంది. అసలు ఈ పథకం కింద ఎలా లబ్ది పొందాలనేది చూద్దాం.

Telangana: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఎగిరి గంతేసేవార్త.. నేరుగా అకౌంట్లోకి రూ.3 లక్షలు.. ప్రతీఒక్కరికీ అవకాశం
money
Venkatrao Lella
|

Updated on: Apr 03, 2026 | 2:59 PM

Share

నిరుద్యోగులు స్వయం ఉపాధి పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. అందులో రాజీవ్ యువ వికాసం పథకం ఒకటి. 2025 మార్చి 15న ఈ పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. 5 లక్షల మంది యువతకు ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అసలు ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? అర్హతలు ఏంటి..? ఎవరవెవరు అర్హులు..? అప్లై చేసుకునేందుకు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి..? అనే విషయాలు చూద్దాం.

రాజీవ్ యువ వికాసం పథకం..?

రాష్ట్రంలో యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు తెచ్చిన పథకం ఇది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన యువత ఈ పథకం ద్వారా లబ్ది పొందవచ్చు. మీరు వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటే రూ.50 వేల నుంచి రూ.3 లక్షల వరకు ఆర్ధిక సాయం అందిస్తారు. ఒక్కో యూనిట్‌కు 60 నుంచి 100 శాతం సబ్సిడీ అందిస్తారు. ఇక మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ నుంచి రుణంగా అందిస్తారు. ఇక నైపుణ్యం కోసం 15 రోజుల పాటు ఉచిత శిక్షణ కూడా ప్రభుత్వం అందిస్తుంది.

ఎవరెవరు అర్హులంటే..?

-నిరుద్యోగి అయి ఉండాలి

-తెలంగాణ నివాసి అయి ఉండాలి

-ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ, ఎంబీసీ వర్గాలకు చెందినవారు అర్హులు

-గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.5 లక్షల్లోపు, పట్టణాల్లో రూ.2 లక్షల్లోపు ఉండాలి

-ఒక కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే అర్హులు

-అత్యంత పేదలకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది.

-వ్యవసాయ రంగాలవారి వయస్సు 21 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి

-వ్యవసాయేతర రంగాలకు 21 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి

కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే..

ఆధార్, రేషన్, క్యాస్ట్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్, పట్టాదారు పాస్ బుక్, మొబైల్ నెంబర్, పాస్ పోర్ట్ సైజు ఫొటో

దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

-https://tgobmms.cgg.gov.in వెబ్ సైట్ ఓపెన్ చేయండి

-రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోండి

-ఏ వర్గానికి చెందినవారో సెలక్ట్ చేసుకోండి

-పేరు, ఆధార్ నెంబర్, రేషన్ కార్డు నెంబర్, లబ్దిదారుడి రకం వివరాలు ఎంటర్ చేయండి

-సెక్టార్ సెలక్ట్ చేసుకోండి

-స్కీమ్ బాక్స్‌లో లోన్ దేని కోసం అనేది ఎంచుకోండి

-మీకు లోన్ ఎంత వచ్చే అవకాశం ఉందనే వివరాలు కనిపిస్తాయి

-గో బటన్ క్లిక్ చేసి సెకండ్ ఫేజ్ పూర్తి చేయండి

-డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయండి

-అప్లికేషన్ రివ్యూలోకి వెళుతుంది

స్టేటస్ చెక్ చేసుకోండి

జిల్లా బీసీ ఎల్పేర్ అధికారి హెల్ప్ లైన్ నెంబర్ 040-12345678 నెంబర్‌కి కాల్ చేసి తెలుసుకోవచ్చు.

Follow Us