పెద్ది ఆడుద్ది.. 9 అసలైన కారణాలు ఇవే

03 June 2026

Pic credit - Instagram

Phani Ch

చరణ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, డాన్స్, పెర్ఫార్మన్స్ అన్నీ సినిమాలో హైలెట్ అవుతాయని మేకర్స్ చెప్పిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ మ్యాచ్ పుణ్యమా అని జనాలు థియేటర్లకు రావడం మానేశారు. ‘పెద్ది’ తో తెరుచుకుంటున్నాయి. ఇది కనుక హిట్ అయితే.. డిస్ట్రిబ్యూటర్లకి, థియేటర్లకు ఊరట లభించినట్టే.

జగపతి బాబు ఈ సినిమాలో అప్పల సూరి అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన లుక్ చాలా కొత్తగా డిజైన్ చేశారు. కథలో కూడా అతని పాత్ర చాలా కీలకం అంటున్నారు.

రత్నవేలు అందించిన అద్భుతమైన కెమెరా విజువల్స్ వెండితెరపై ప్రతి సన్నివేశాన్ని అత్యంత సుందరంగా, రిచ్ గా ఆవిష్కరించాయి.

జాన్వీ కపూర్ రామ్ చరణ్ తో సాగే ఆమె లవ్ ట్రాక్, భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది.

‘మీర్జాపూర్’ సిరీస్ తో అందరినీ ఆకట్టుకున్న దివ్యెందు శర్మ ‘పెద్ది’లో నెగిటివ్ రోల్ పోషించాడు. అది కూడా అందరిలో ఆసక్తిని క్రియేట్ చేసే అంశం.

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన బిజిఎమ్ థియేటర్లలో రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. ఇప్పటికే విడుదలైన పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.

ఇది కమర్షియల్ సినిమా కాదు. గ్రామీణ క్రీడలైన కుస్తీ, క్రికెట్ నేపధ్యంలో సాగే భావోద్వేగాల ప్రయాణం. క్లైమాక్స్ లో వచ్చే యాభై నిమిషాల ఎమోషనల్ సీన్లు  ప్రేక్షకుడి చేత కన్నీళ్లు పెట్టించేలా ఉంటాయట.

క్రీడల నేపధ్యం, పల్లెటూరి ఆత్మగౌరవం కోసం చేసే పోరాటం, మరియు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ విలక్షణ నటన ఈ సినిమాను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడం ఖాయం అనిపిస్తోంది.