పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కొత్త సదుపాయాలు

Venkatrao Lella

Images: Pinterest

03 JUNE 2026

వ్యవస్థలోని అడ్డంకులను తొలగించి ఆధునీకరించడమే లక్ష్యంగా ఈ ఏడాది ఈపీఎఫ్‌వో 3.0 వెర్షన్ విడుదల చేయనుంది. ఇందులో అనేక ఆన్‌లైన్ సేవలను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు కొత్త సౌకర్యాలు తీసుకురానుంది.

ఈపీఎఫ్‌వో 3.0

సభ్యులు త్వరలో తమ UANతో ఆధార్, బ్యాంకు ఖాతాలను అనుసంధానించడం ద్వారా ATMల ద్వారా నేరుగా నిధులను ఉపసంహరించుకోగలుగుతారు. ఇందుకోసం ప్రత్యేక ఈపీఎఫ్‌వో డెబిట్ కార్డును జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

ATM విత్ డ్రా

ఆన్‌లైన్ ఓటీపీ ఆధారిత అప్‌డేట్‌లు, క్లెయిమ్ ట్రాకింగ్ వల్ల కాగితపు పని తగ్గుతుంది. ఈపీఎఫ్‌వో ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం అనేది భవిష్యత్తులో ఉండదు.

వేగవంతమైన క్లెయిమ్‌లు

నామినీలకు మైనర్ల కోసం సంరక్షక ధృవీకరణ పత్రాలు అవసరం ఉండదు. దీనివల్ల ఖాతాదారుడు మరణిస్తే.. కుటుంబసభ్యులకు క్లెయిమ్ పరిష్కారాలు వేగంగా, సులభంగా జరుగుతాయి

త్వరిత మరణ పరిష్కారాలు

కొత్త యాప్ రిలీజ్ చేయనున్నారు. దీనివల్ల వినియోగదారులు తమ ఫోన్‌లలోనే బ్యాలెన్స్‌లు, డిపాజిట్లు, క్లెయిమ్‌లను సౌకర్యవంతంగా తనిఖీ చేసుకోగలరు.

మొబైల్-ఫస్ట్ డిజైన్

యూపీఐ ద్వారా పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉన్నట్లు ఇటీవల కేంద్రం ప్రకటించింది. కొద్ది రోజుల్లో ఇది అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.

యూపీఐ సౌకర్యం

ఇక క్లెయిమ్స్ ఆటో సెటిల్మెంట్ చేయనున్నారు. ప్రస్తుతం క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలిస్తారు. అనంతరం అనుమతి ఇస్తే డబ్బులు పడతాయి. కానీ ఇక నుంచి ఆటోమేటిక్ చెల్లింపులు జరుగుతాయి.

ఆటో సెటిల్మెంట్

త్వరలో ఈపీఎఫ్‌వో వాట్సప్ సౌకర్యం కల్పించనుంది. అంటే వాట్సప్ ద్వారానే బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఫిర్యాదులు కూడా చేయడంతో పాటు స్టేట్‌మెంట్ చెక్ చేసుకోవచ్చు

వాట్సప్ సౌకర్యం

ఈ ఫీచర్లతో రానున్న రోజుల్లో ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు కాగితపు పని తగ్గనుంది. ఆన్ లైన్ ద్వారా ఏ పని అయినా సులువుగా చేసుకునే సౌకర్యం లభించనుంది. నిమిషాల్లోనే అనీ పనులు పూర్తవుతాయి.

తగ్గనున్న కాగితపు పని