బాగా పండిపోయిన అరటిపండ్లు ఆరోగ్యానికి వరం.. ఎందుకో తెల్సా!
03 June 2026
TV9 Telugu
TV9 Telugu
ఒక్కోసారి ఇంట్లో ఉన్న అరటి పండ్లు మర్చిపోతుంటాం. దీంతో అవి బాగా పండిపోతాయి. ఇలా ఎక్కువగా పండిపోయిన అరటి పండ్లను చాలా మంది పడేస్తుంటారు. కానీ వీటిల్లో పోషకాలు దండిగా ఉంటాయని మీకు తెలుసా?
TV9 Telugu
బాగా పండిపోయిన అరటి పండ్లలో పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇవి బీపీని నియంత్రించడంలో ఎంతగానో సహాయం చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి
TV9 Telugu
గుండె పోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బాగా పండిన అరటి పండు సహజసిద్ధమైన అంటాసిడ్ మాదిరిగా పనిచేస్తుంది. అందువల్ల ఈ పండ్లను తింటే అసిడిటీ తగ్గిపోతుంది
TV9 Telugu
జీర్ణాశయ గోడలపై ఉండే మ్యూకస్ పొర రక్షించబడుతుంది. దీంతో కడుపులో మంట, గుండెల్లో మంట, అజీర్తి నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. బాగా పండిన అరటి పండ్లలో ట్రిప్టోఫాన్ అనే సమ్మేళనం అధిక మొత్తంలో ఉంటుంది
TV9 Telugu
ఇది ఒక అమైనో యాసిడ్. ఇది మన శరీరంలో సెరొటోనిన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. సెరొటోనిన్ ఒక న్యూరోట్రాన్స్‌మిటర్. ఇది మూడ్‌ను నియంత్రిస్తుంది. ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడేస్తుంది
TV9 Telugu
మైండ్ రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. దీంతో మానసికంగా ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉంటారు. బాగా పండిన అరటి పండ్లను తినడం వల్ల శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది
TV9 Telugu
ఈ పండ్లలో ఉండే చక్కెరలను శరీరం సులభంగా గ్రహిస్తుంది. దీంతో తక్షణమే శక్తి లభించి ఉత్సాహంగా మారుతారు. ఉత్తేజంగా పనిచేస్తారు. చురుగ్గా ఉంటారు. శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి
TV9 Telugu
నీరసం, అలసట నుంచి వెంటనే బయట పడవచ్చు. ఇక బాగా పండిన అరటి పండ్లను తినేటప్పుడు లోపలి గుజ్జులో ఎలాంటి మచ్చలు లేకుండా చూసుకోవాలి. మరీ అతిగా పండిన అరటి పండు నుంచి మురిగిన వాసన వస్తే మాత్రం వాటిని తినకూడదు