విపరీతమైన వేడితో యూరిన్ రాని వాళ్ళకు.. చల్లదనం చేసే ఈ శర్బత్‌ తాగేయండి

03 June 2026

TV9 Telugu

TV9 Telugu

వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సంప్రదాయ పానీయాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వీటిల్లో సోంపు శర్బత్‌ వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. సువాసనతోపాటు జీర్ణక్రియకు మేలు చేసే ఈ శర్బత్ ను సోంపు గింజలు, మసాలా దినుసులు, తీపి పదార్థం, చల్లటి నీటితో తయారు చేస్తారు

TV9 Telugu

వేడి రోజుల్లో దాహాన్ని తీర్చే ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ఇది ఉపయోగపడుతుంది. సోంపు శర్బత్‌లో ఉండే సోంపు గింజలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవి కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి

TV9 Telugu

అలాగే నోటి దుర్వాసనను తగ్గించడంలో కూడా సహకరిస్తాయి. శరీరానికి తగినంత హైడ్రేషన్ అందించడం వల్ల వేసవి కాలంలో అలసటను తగ్గించి తాజాగా ఉండేలా చేస్తుంది

TV9 Telugu

ఈ శర్బత్ తయారీకి ముందుగా సబ్జా గింజలను 10 నుంచి 15 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. అవి బాగా విస్తరించాక‌ పక్కన పెట్టాలి. మరోవైపు సోంపు, నల్ల ఉప్పు, మిరియాలు, యాలకులు, తీపి పదార్థాన్ని కలిపి మెత్తని పొడిలా చేసుకోవాలి

TV9 Telugu

ఈ మిశ్రమాన్ని జల్లించి గాలి చొరబడని సీసాలో నిల్వ చేసుకోవచ్చు. శ‌ర్బత్ తయారు చేసేటప్పుడు ఒక గ్లాస్ చల్లటి నీటిలో రెండు  టీ స్పూన్ల సోంపు మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. అనంతరం నానబెట్టిన సబ్జా గింజలను జోడించి చల్లగా వడ్డించాలి

TV9 Telugu

అవసరమైతే కొద్దిగా నిమ్మరసం కూడా కలిపి రుచిని మరింత పెంచుకోవచ్చు. సోంపు శర్బత్ ప్రీమిక్స్‌ను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే 2, 3 వారాల వరకు తాజాగా ఉంటుంది. తేమ తగలకుండా పొడి చెంచాతో తీసుకుని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు

TV9 Telugu

తీపి కోసం మాంక్ ఫ్రూట్‌కు బదులుగా తేనె, బెల్లం, స్టీవియా లేదా సాధారణ చక్కెరను కూడా ఉపయోగించవచ్చు. బెల్లం ఉపయోగిస్తే ప్రత్యేకమైన రుచి వస్తుంది. తక్కువ కేలరీలు కోరుకునేవారు స్టీవియాను ఎంపిక చేసుకోవచ్చు

TV9 Telugu

వ్యక్తిగత అభిరుచికి అనుగుణంగా తీపి పరిమాణాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. వేసవి ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు, శరీరాన్ని చల్లగా ఉంచేందుకు, జీర్ణక్రియను మెరుగుపరచేందుకు సోంపు శర్బత్ చక్కని ఎంపిక అని చెప్పవచ్చు