Mango Season 2026: హైదరాబాద్ సీపీ సజ్జనార్ వేసవిలో మామిడి పండ్ల కొనుగోలుపై ప్రజలను హెచ్చరించారు. కొందరు వ్యాపారులు లాభాపేక్షతో కాల్షియం కార్బైడ్ వంటి ప్రమాదకర రసాయనాలతో పండ్లను కృత్రిమంగా మగ్గిస్తున్నారని తెలిపారు. ఇవి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తాయని, ప్రజలు సహజంగా పండిన పండ్లను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.