అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికల ప్రకారం, ఆంధ్రప్రదేశ్లో రాబోయే రెండు రోజులు ఉష్ణోగ్రతలు 42-43 డిగ్రీల వరకు పెరగనున్నాయి. 54 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 16 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలపై దీని ప్రభావం అధికంగా ఉంటుంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.